118 మంది ప్రయాణీకులతో వెళ్తున్న విమానం హైజాక్, పేల్చేస్తామని బెదిరింపు!
లిబియాలో 118 మందితో ప్రయాణిస్తున్న విమానాన్ని హైజాక్ చేశారు. ఆఫ్రికియా ఎయిర్ లైన్స్‌కు చెందిన విమానం హైజాక్‌కు గురయింది. విమానాన్ని హైజాకర్లు మాల్టా వైపు మళ్లించారు.
లిబియా: లిబియాలో 118 మందితో ప్రయాణిస్తున్న విమానాన్ని హైజాక్ చేశారు. ఆఫ్రికియా ఎయిర్ లైన్స్‌కు చెందిన విమానం హైజాక్‌కు గురయింది. విమానాన్ని హైజాకర్లు మాల్టా వైపు మళ్లించారు. అక్కడ దించారు. విమానాన్ని పేల్చేస్తామని బెదిరించినట్లుగా తెలుస్తోంది.
ఎయిర్ బస్ ఏ320 హైజాక్ గురైందని, అనంతరం విమానం మాల్టాలో ల్యాండ్ అయిందని స్థానిక మీడియా వెల్లడించింది. హైజాక్ గురైన సమయంలో విమానంలో 111 మంది ప్రయాణికులు, ఏడుగురు క్యాబిన్ క్రూ ఉన్నారు.

లిబియా ఇంటర్నల్ ఫ్లైట్ హైజాక్‌కి గురయిందని, దానిని మాల్టాకి మళ్లించినట్లు సమాచారం అందింది, భద్రతా అధికారులు దీనికి సంబంధించి చర్యలు తీసుకుంటున్నారని మాల్టా ప్రధఆని జోసఫ్ ముస్కట్ ట్విట్టర్‌లో పేర్కొన్నారు.
లిబియా నియంత గడాఫీ మద్దతుదారులుగా చెప్పుకుంటున్న హైజాకర్లు గ్రేనేడ్లతో విమానాన్ని పేల్చివేస్తామని చెప్పారు. హైజాక్ నేపథ్యంలో మాల్టాలో పలు విమానాలు దారి మళ్లించి, మరి కొన్నింటిని రద్దు చేశారు.
లొంగిపోయిన హైజాకర్లు
విమానం హైజాక్‌కి గురైన ఘటనలో హైజాకర్లు లొంగిపోయినట్లు మాల్టా ప్రధాని జోసఫ్ ముస్కట్ ఆ తర్వాత ప్రకటించారు. భద్రతా బలగాలు వారిని అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు.
హైజాకర్లు దానిని మాల్టాకు మళ్లించగా అధికారులు వారితో చర్చలు జరిపారు. అనంతరం ప్రయాణీకులందరినీ విడిచిపెట్టారు.హైజాకర్లు తొలుత మహిళలను, చిన్నారులను వదిలేశారు. ఆ తర్వాత లొంగిపోయారు. దీంతో అధికారులు ఊపిరిపీల్చుకున్నారు.
-
విశాఖ టు బెంగళూరు వయా తిరుపతి వందేభారత్ స్లీపర్ రెడీ - రూట్ , ముహూర్తం..!! -
ఏపీలో భారీగా మద్యం ధరల తగ్గింపు, ఏ బ్రాండ్ ఎంత..!! -
ఢిల్లీలో జగన్ రూటు మారిందా, పార్లమెంట్ సాక్షిగా - కీలక మలుపు..!! -
T20 World Cup: సూర్యకుమార్ యాదవ్ కు ఐసీసీ అనూహ్య షాక్..! -
India Post GDS 2nd Merit List 2026: పోస్టల్ జాబ్స్ రెండో మెరిట్ లిస్ట్ అప్పుడే? -
టీం ఇండియాకు బీసీసీఐ భారీ నజరానా, ఒక్కొక్కరికి ఎంతంటే..!! -
పెట్రోల్ పై కేంద్రం ఎస్మా ప్రయోగం:LPG ఉత్పత్తి పెంచాలని హుకుం -
భారీగా పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు! -
మిథున రాశి 2026 2027 జాతకం.. ఈ ఏడాది వీరి మాటే శాసనం! -
టీమిండియాపై విధ్వంసకర సెంచరీ: కెప్టెన్‌గా ప్రమోషన్ -
వరల్డ్ కప్ గెలిచినా తప్పని చిక్కులు! ఆ ఆటగాడిపై ఐసీసీ వేటు? -
న్యూజిలాండ్ ఫస్ట్ సిరీస్- టీ20 వరల్డ్ కప్ ఫైనల్ తర్వాత జట్టులో భారీ మార్పలు












Click it and Unblock the Notifications