కారులో స్థలం లేదని ప్రసవం కోసం సైకిల్‌పై ఆసుపత్రికి వెళ్లిన మహిళా మంత్రి

వెల్లింగ్టన్: న్యూజిలాండ్‌కు చెందిన మహిళా మంత్రి డెలివరీ కోసం సైకిల్ పైన ఆసుపత్రికి వెళ్లారు. ఆ మంత్రి పేరు జూలీ అన్నె. గర్భిణీ స్త్రీలు సాధారణంగా నడవడమే కష్టం. కానీ ఈమె సైకిల్ పైన ఆసుపత్రికి వెళ్లింది. అదీ మంత్రి హోదాలో. ఆమె మహిళా సంక్షేమ శాఖ మంత్రి. సైకిల్ తొక్కుకుంటూ ఆసుపత్రికి చేరుకున్నారు.

మంత్రి జూలీ అన్నె గెంటర్ 42 వారాల గర్భిణి. ప్రవస సమయం దగ్గర పడింది. దీంతో ఆదివారం ఆమె ఆసుపత్రిలో చేరారు. ఆమె సైకిల్ తొక్కుకుంటూ రావడం చూసి అందరూ ఆశ్చర్యపోయారు. మంత్రి, పైగా గర్భిణి. తన ఇంటి నుంచి కిలో మీటరు దూరంలోని అక్లాండ్ సిటీ ఆసుపత్రికి జూలీ, ఆమె భర్త సైకిల్ పైన వచ్చారు.

Pregnant New Zealand minister cycles to delivery ward

ఇందుకు సంబంధించిన ఫోటోను జూలీ ఇన్‌స్టాగ్రాంలో పోస్ట్ చేశారు. నా సిబ్బందికి కారులో సరిపడా స్థలం లేదని, నేను, నా భర్త చెరో సైకిల్ పైన ఆసుపత్రికి వచ్చామని, ఇలా రావడం తనకు ఎంతో ఆనందాన్ని ఇచ్చిందని చెప్పారు. ఆమెకు ఇది తొలి సంతానం.

ఇటీవలే న్యూజిలాండ్‌ ప్రధానమంత్రి జసిందా ఆర్డెన్‌ కూడా ఆడబిడ్డకు జన్మనిచ్చారు. ఈ ఏడాది జూన్‌లో జసిందాకు ప్రసవమైంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+