అది పాపిస్థానే: గర్భవతిని సజీవదహనం చేశాడు

లాహోర్: పాకిస్థాన్‌లో మరో దారుణ ఘటన చోటు చేసుకుంది. ఓ 23ఏళ్ల నిండు గర్భవతిని సజీవ దహనం చేశాడు ఆమె భర్త సోదరుడు. ఘటనపై కేసు నమోదు కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. దర్యాప్తు చేస్తున్నారు.

ఘటనకు సంబంధించిన వివరాల్లోకి వెళితే.. గత సంవత్సరం సిద్రా అనే యువతికి వారీస్ అలీ అనే యువకుడితో నిశ్చితార్థం జరిగింది. అయితే ఆమెను పెళ్లి చేసుకోకుండా ఉద్యోగ రీత్యా సౌదీ అరేబియాకు వెళ్లిపోయాడు. దీంతో అలీ తమ్ముడు వాక్వాస్ ఆమెను వివాహం చేసుకున్నాడు.

 Pregnant Woman Burnt Alive In Pakistan

కొద్ది రోజుల క్రితం సౌదీ అరేబియా నుంచి తిరిగి వచ్చిన అలీ.. తనకు కాబోయే భార్యను తన తమ్ముడు చేసుకోవడంతో ఒక్కసారిగా షాక్‌కు గురయ్యాడు. మరోవైపు అన్నదమ్ముల మధ్య వ్యాపారం బెడిసికొట్టింది. దీంతో తమ్ముడి భార్యపై కోపం పెంచుకున్నాడు అలీ.

ఈ క్రమంలో సిద్రా ఆదివారం గదిలో ఒంటరిగా నిద్రపోతున్న సమయంలో ఆమెపై పెట్రోల్ పోసి నిప్పంటించాడు. అంతటితో ఆగకుండా గదికి తలుపులు వేసి పారిపోయాడు.

అగ్నిమాపక దళాలు వచ్చే సరికే సిద్రా మంటల్లో పూర్తిగా కాలిపోయింది. సమాచారం అందుకున్న పోలీసులు నిందితుడు అలీతో పాటు కుటుంబసభ్యులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+