Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

ఎఫ్‌బీఐ డైరెక్టర్ గా కశ్యప్ పటేల్ - ట్రంప్ అనూహ్య ఎంపిక..!!

అమెరికా నూతన అధ్యక్షుడు తన టీంను సిద్దం చేసుకుంటున్నారు. అధ్యక్ష బాధ్యతలు చేపట్టే లోగా కీలక నియామకాలు పూర్తి చేస్తున్నారు. తన టీంలో భారతీయ సంతతికి ప్రాధాన్యత ఇస్తున్నారు. అందులో భాగంగా మరో కీలక నియామకం చేసారు. అమెరికాలో ప్రతిష్ఠాత్మకంగా భావించే ఎఫ్‌బీఐకి తదుపరి డైరెక్టర్ కశ్యప్ (కాశ్) పటేల్ ను నియమిస్తున్నట్లు ట్రంప్ ప్రకటన చేసారు. కశ్ సమర్ధత గురించి ట్రంప్ ఆసక్తి కర విశ్లేషణ చేసారు.

అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన డొనాల్డ్ ట్రంప్ తన పాలనా యంత్రాగంలో వ్యూహాత్మకంగా నియామకాలు చేస్తున్నారు. భారతీయ సంతతికి చెందిన వారికి కీలక బాధ్యతలు అప్పగస్తున్నారు. అమరికా ఫెడరల్ బ్యూరో డైరెక్టర్ గా కశ్యప్ పటేల్ ను నియమించారు. ఈ మేరకు కశ్ నియామం వెనుక కారణాలను వెల్లడించారు. కశ్ గొప్ప న్యాయవాది, పరిశోధకుడుగా ట్రంప్ పేర్కొన్నారు. అమెరికాలో అవినీతి నిర్మూలనతో పాటుగా... న్యాయం కోసం నిరంతరం శ్రమిస్తున్నారని చెప్పుకొచ్చారు. అమెరికా ప్రజల కోసం అండగా నిలిచారని పేర్కొన్నారు. ఎఫ్‌బీఐకి డైరెక్టర్ గా కశ్యప్ నియామకంతో పూర్వ వైభవం తీసుకొస్తామని ట్రంప్ విశ్వాసం వ్యక్తం చేసారు.

President-elect Donald Trump appointed Kashyap Patel as the head of the FBI

కశ్యప్ తొలి నుంచి ట్రంప్ కు విధేయుడిగా ఉన్నారు. కశ్యప్ మూలాలు భారత లోని గుజరాత్ లో ఉన్నాయి. కశ్ పేరెంట్స్ తూర్పు ఆఫ్రికాలో పెరిగారు. ఉగాండా లో పరిస్థితుల కారణంగా అమెరికా కు వలస వచ్చారు. 1980 లో న్యూయార్క్ లోని గార్డెన్ సిటీలో కశ్యప్ జన్మించారు. యూనివర్సిటీ ఆప్ రిచ్ మండ్ లో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసారు. యూనివర్సిటీ కాలేజ్ లండన్ లో న్యాయ విద్య లో పట్టా అందుకున్నారు. ఆ తరువాత మియామీ కోర్టుల్లో పబ్లిక్ డిఫెండర్ గా వివిధ హోదాల్లో పని చేసారు. ఇక, ఇప్పుడు ట్రంప్ నిర్ణయంతో ఎఫ్‌బీఐ డైరెక్టర్ గా బాధ్యతలు చేపట్టనున్నారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+