ప్రధాని మోదీతో మాట్లాడుతాం - ఉక్రెయిన్ కు మద్దతుగా : బైడెన్ కీలక ప్రకటన..!!
ఉక్రెయిన్ పైన రష్యా దాడిని అమెరికా అధ్యక్షుడు తీవ్రంగా పరిగణిస్తున్నారు. పుతిన్ నిర్ణయాన్ని తప్పు బడుతున్నారు. పుతిన్ ను దురాక్రమణదారుడిగా అభివర్ణించారు. యుక్రెయిన్ పైన సైనిక చర్య ప్రారంభమైందని ప్రకటించిన పుతిన్.. ఎవరైనా జోక్యం చేసుకుంటే తీవ్ర పరిణమాలు ఉంటాయని హెచ్చరించారు. ఇక, అమెరికా అధ్యక్షుడు బైడెన్ రష్యా పైన కఠిన ఆర్దిక ఆంక్షలు విధిస్తూ నిర్ణయం తీసుకున్నారు. దీర్ఘకాలంలో రష్యాపైన పెను ప్రభావం చూపించే నిర్ణయాలను ప్రకటించారు.
Recommended Video

భారత్ తో చర్చలు చేస్తాం
తమ దేశంతో పాటుగా మిత్ర దేశాలతోనే సంప్రదింపులు చేసి..రష్యాతో వాణిజ్య బంధాల పైన నిర్ణయం తీసుకుంటామని హెచ్చరించారు. రష్యా వైఖరిపైన భారత ప్రధాని మోదీతోనూ సంప్రదింపులు చేస్తామని బైడెన్ ప్రకటించారు. అమెరికాపై రష్యా సైబర్ దాడులు జరుపుతాయన్న వార్తలు వినిపిస్తున్న పరిస్థితుల్లో వాటిని తాము సమర్ధంగా ఎదుర్కొంటామని స్పష్టం చేసారు. ఇదే అంశానికి సంబంధించి ట్వీట్ చేసిన బైడెన్.. పుతిన్ అన్యాయంగా ఉక్రెయిన్‌పై దాడి చేస్తున్నారు. దీన్ని అడ్డుకునేందుకు రష్యాపై కఠినమైన ఆర్థిక ఆంక్షలు విధించాలని మేం నిర్ణయించుకున్నా మని ట్వీట్ లో పేర్కొన్నారు.

పుతిన్ తో మోదీ చర్చలు
ఇక, ఇదే సమయంలో రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌తో.. భారత ప్రధాని నరేంద్ర మోదీ మాట్లాడారు. హింసను వెంటనే విడనాడాలని పుతిన్‌ను మోదీ కోరినట్లు ప్రధానమంత్రి కార్యాలయం వెల్లడించింది.దౌత్యపరమైన చర్చలతోనే సమస్యకు పరిష్కారం వెతకాలని మోదీ సూచించినట్లు పేర్కొంది. ఇక ఉక్రెయిన్‌కు సంబంధించి ఇటీవలి పరిణామాల గురించి పుతిన్.. మోదీకి వివరించినట్లు తెలిపింది పీఎంఓ కార్యాలయం.నాటో, రష్యా మధ్య విభేదాలు.. చర్చల ద్వారా మాత్రమే పరిష్కారమవుతాయని మోదీ వ్యాఖ్యానించారు.

ఉక్రెయిన్ లో భారతీయుల భద్రతపై
ఉక్రెయిన్‌లోని భారతీయ పౌరులు, ముఖ్యంగా విద్యార్థుల భద్రతపై ప్రధాని ఆందోళన వ్యక్తం చేసినట్లు పీఎంఓ తెలిపింది. వారిని సురక్షితంగా భారత్‌కు తీసుకొచ్చేందుకు అధిక ప్రాధాన్యమిస్తున్నట్లు పుతిన్‌కు వివరించినట్లు పీఎంఓ వెల్లడించింది. ఉక్రెయిన్‌లో ఉద్రిక్త పరిస్థితి ఉన్నచోట భారత పౌరులు, విద్యార్థులను స్వదేశానికి తీసుకొచ్చేందుకు ప్రయాత్నాలు చేస్తున్నామని రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ తెలిపారు. ఇరు దేశాలు శాంతియుతంగా సమస్యను పరిష్కరించుకోవాలని భారత్ కోరుకుంటోందని అన్నారు.












Click it and Unblock the Notifications