పిలవని పెళ్లికి ఒబామా: తెగ సంబరపడిన కొత్తజంట
కాలిఫోర్నియా: ఓ కొత్త జంట తమ వివాహ వేడుక రోజున ఎనలేని సంభ్రమాశ్చర్యాలకు గురైంది. ఎందుకంటే వారి పెళ్లికి ఓ అనుకోని అతిథి వచ్చారు. ఆయన ఎవరో కాదు, ఏకంగా అమెరికా అధ్యక్షుడైన బరాక్ ఒబామా. దీంతో ఆ జంట ఆనందానికి అవధులు లేకుండా పోయాయి.
ఈ ఘటన కాలిఫోర్నియాలో జరిగింది. నూతన వధూవరులు స్టిఫానీ, బ్రియాన్ టోబేలు తమ వివాహాన్ని లా జొల్లాలోని గోల్ఫ్ కోర్స్‌లో వేడుకగా జరపాలని నిర్ణయించుకున్నారు. అదే సమయానికి కాలిఫోర్నియా పర్యటనలో ఉన్న ఒబామా అదే ప్రాంతంలో వ్యాహ్యాళికి వచ్చారు.

‘తొలుత మీ వివాహ వేడుకను వెంటనే ముగించండి లేదా కాస్త ఆలస్యంగా మొదలు పెట్టుకోండి' అని ఆయన రక్షణ సిబ్బంది కోరినట్టు వెడ్డింగ్ ఫోటోగ్రాఫర్ ఎరిన్ సీఎన్ఎన్‌కు తెలిపారు. ‘సీక్రెట్ సర్వీసెస్‌కు చెందిన రెండు ఎస్యూవీలను చూసిన తరువాత, అందులో ఉన్నది ఎవరో మాకు తెలిసింది' అని టోబ్ వ్యాఖ్యానించారు. వీరిని చూసి ఆహ్వానించిన ఒబామా వారితో కలిసి ఫోటోలు దిగారు.
ఇది తమకు జీవితాంతమూ గుర్తుండిపోతుందని ఆ జంట ఇప్పుడు ఆనందంగా చెప్పుకుంటోంది. కాగా, నిరుడు ఓ గోల్ఫ్ కోర్సులో ఒబామా కోసం భద్రతా సిబ్బంది బలవంతంగా ఓ పెళ్లిని రద్దు చేయడం విమర్శలకు దారితీసిన సంగతి తెలిసిందే. ఆ సమయంలో వారి ఆనందానికి అడ్డు వచ్చినందుకు ఒబామా క్షమాపణలు కూడా చెప్పారు.












Click it and Unblock the Notifications