వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఫేస్‌బుక్‌లో ఖాతా తెరిచిన ఒబామా: తొలి పోస్ట్ ఇదే..!

By Nageswara Rao
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: అమెరికా అధ్యక్షుడు బారక్ ఒబామా ఎట్టకేలకు ఫేస్‌బుక్‌లో చేరారు. ప్రపంచంలో ప్రతి నలుగురు పెద్దవాళ్లలో ముగ్గురు ఫేస్‌బుక్‌లో ఉన్నందున, అందరితో భావాలు పంచుకోవడానికి ఇదే మంచి సాధనమని భావించి చేరానని చెప్పుకొచ్చారు.

వాతావరణ మార్పుల గురించి, భూమిని రక్షించాలంటూ ఓ వీడియోని తీసి తొలి పోస్టుగా పోస్టు చేశారు. అందులో వైట్‌హౌస్ పచ్చిక బయళ్లపై నడుస్తూ, ఆయన మాట్లాడారు. తన తరువాత వచ్చే అమెరికా అధ్యక్షులు కూడా ఇలాగే చేయాలని కోరుకుంటున్నట్టు తెలిపారు.

ప్రకృతి మనకు అందించిన అద్భుతమైన గిప్ట్‌లైన నేషనల్ పార్కులు, అద్భుతమైన ప్రకృతి సౌందర్యం, కొండలు, సముద్రాలు అన్నింటినీ అమెరికన్లందరూ కూడా ఎంజాయ్ చెయ్యాలనే భావిస్తున్నట్లు ఆ వీడియోలో చెప్పారు.

President Obama joins Facebook, addresses climate change in first post

సోమవారం ఆయన ఈ వీడియోను పోస్టు చేయగా ఇప్పటి వరకు దానిని 16.42 లక్షల మంది వీక్షించారు. ఒబామా ఫేస్‌బుక్‌ ఖాతాను 4.5 కోట్ల మంది ఫాలో అవుతున్నారు. ఈ ఫేస్‌బుక్ అకౌంట్‌ని ఆర్గనైజింగ్ ఫర్ యాక్షన్ అనే సంస్థ నిర్వహిస్తుంది.

కాగా, గతంలో ఒబామా కార్యాలయం ఫేస్ బుక్ ఖాతాను ప్రారంభించగా, ఇప్పుడు ఆయనే స్వయంగా తన పేరిట ఖాతాను తెరిచారు. మే నెలలోనే ట్విట్టర్‌లో చేరిన ఒబామా, తన పదవీకాలం ముగుస్తున్న సమయంలో సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటున్నారు.

Hello, Facebook! I finally got my very own page. I hope you’ll think of this as a place where we can have real conversations about the most important issues facing our country – a place where you can hear directly from me, and share your own thoughts and stories. (You can expect some just-for-fun stuff, too.)I’m kicking it off by inviting you to take a walk with me in my backyard – something I try to do at the end of the day before I head in for dinner. I say this often, but that’s because it’s always at the front of my mind: We’ve got to preserve this beautiful planet of ours for our kids and grandkids. And that means taking serious steps to address climate change once and for all. Now, we've made a lot of progress to cut carbon pollution here at home, and we're leading the world to take action as well. But we’ve got to do more. In a few weeks, I’m heading to Paris to meet with world leaders about a global agreement to meet this challenge.I hope you'll join me in speaking out on climate change and educating your friends about why this issue is so important. At a time when nearly three in four adults online use Facebook, this feels like a great place to do it. Share your thoughts in the comments, and pass this message on to folks you think need to see it.If we're all in this together, I'm confident we can solve this and do right by future generations.

Posted by President Obama on Monday, November 9, 2015

English summary
President Barack Obama joined Facebook on Monday and said he wanted his account to be "a place where we can have real conversations," diving right in with his first post on climate change.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X