ఒబామా నిజంగానే ఏడ్చారు: నమ్మిన డొనాల్డ్ ట్రంప్

వాషింగ్టన్: ఇటీవల అమెరికా అధ్యక్షులు బరాక్ ఒబామా కంటతడి పెట్టడంపై దేశ అధ్యక్ష రేసులో ఉన్న డొనాల్డ్ ట్రంప్ స్పందించారు. బహిరంగ కాల్పుల ఘటనకు అడ్డుకట్ట వేయాలనే లక్ష్యంతో తుపాకుల నియంత్రణ చేపట్టాలని అమెరికా అధ్యక్షుడు ఒబామా తీసుకున్న నిర్ణయం సరైంది కాదన్నారు.

ఇటీవల తుపాకుల నియంత్రణ గురించి ఒబామా బహిరంగ సభలో మాట్లాడిన సమయంలో ఆయన కంటి నుంచి నీరు కూడా వచ్చిందని, అది ఆయన కంటి నుంచి నిజంగానే వచ్చిందని కాకపోతే తుపాకుల నియంత్రణ చేపట్టడం మాత్రం సరికాదన్నారు.

కాగా, దేశంలో పెచ్చరిల్లుతున్న తుపాకీ సంస్కృతిపై అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా కన్నీరు పెట్టిన విషయం తెలిసిందే. మూడేళ్ల క్రితం కనెక్టికట్ 20మంది ఎలిమెంటరీ స్కూల్ పిల్లలను ముష్కరులు తుపాకీ గుళ్లకు బలి చేసిన విషయాన్ని గుర్తు చేసుకుని ఆయన ఏడ్చేశారు.

President Obama tears sincere: Donald Trump

ఆ చిన్నారులు గుర్తుకు వచ్చిన ప్రతిసారీ తాను పిచ్చివాడినై పోతున్నట్లు చెప్పారు. చెక్కిళ్లపై నుంచి కన్నీరు కారుతుండగా తుపాకుల వినియోగాన్ని, తుపాకీ హింసను కట్టడి చేయాల్సిన అవసరం ఉందని ఆయన ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

ఈ విషయంపై ముందుకు వెళ్లాల్సిందిగా కాంగ్రెసును డిమాండ్ చేయాలని ఆయన మంగళవారం శ్వేతసౌధం కార్యక్రమంలో అన్నారు. తుపాకుల అమ్మకాల కట్టడికీ కాంగ్రెసు వ్యతిరేకతను పట్టించుకోకుండా కార్యనిర్వాహక ఉత్తర్వులు ఇవ్వాలని ఆయన నిర్ణయించారు.

గన్ లాబీ కాంగ్రెసును బందీగా చేసుకోగలదేమో గానీ అమెరికాను కాదన్నారు. తుపాకీ సంస్కృతిని అదుపు చేయలేకపోవడం పట్ల ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. తుపాకి సంస్కృతికి వ్యతిరేకంగా ప్రతి ఒక్కరూ రంగంలోకి దిగాలని ఆయన సూచించారు. అభివృద్ధి చెందిన దేశాల్లో మన దేశాల్లో జరుగుతున్నటువంటి తుపాకీ హింస లేదని ఆయన గుర్తు చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+