ట్రంప్-కిమ్ జాంగ్ భేటీ: కిమ్ ఇంగ్లీష్, సింగపూర్ ఎక్కడుందని వెతుకుతున్న అమెరికన్లు
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షులు డొనాల్డ్ ట్రంప్, ఉత్తర కొరియా అధ్యక్షులు కిమ్ జాంగ్ ఉన్ చారిత్రక భేటీ నేపథ్యంలో అమెరికన్లు ఎక్కువగా సింగపూర్ ఎక్కడ ఉంది అని గూగుల్‌లో వెతుకుతున్నారు. ఉప్పు - నిప్పులా ఉండే వీరిద్దరి భేటీ కోసం ప్రపంచవ్యాప్తంగా అందరూ ఎదురు చూశారు. ఆ సమయంలో జూన్ 12న వచ్చింది.
Recommended Video

వారి భేటీ సామరస్యపూర్వకంగా జరిగింది. ఈ భేటీ విజయవంతమవుతుందా అనే ఉత్కంఠ అందరిలోను నెలకొంది. అమెరికన్లు కూడా ఉత్కంఠతోనే ఉన్నారు. కానీ వారు గూగుల్‌లో వెతికింది సింగపూర్ ఎక్కడ అని. ట్రంప్ - కిమ్‌ల భేటీ సింగపూర్‌లోని కేపెల్లా హోటల్లో జరిగింది.

సింగపూర్ ఎక్కడ ఉందని వెతుకుతున్న అమెరికన్లు
గూగుల్ ట్రెండ్స్ డేటా ప్రకారం అమెరికన్లు ఎక్కువ మంది 'వెర్ ఈజ్ సింగపూర్ ఇన్ ది వరల్డ్' (ప్రపంచంలో సింగపూర్ ఎక్కడ ఉంది) అని కూడా చాలామంది వెతికారు. ఈ భేటీకి రెండు రోజుల ముందు నుంచే ఈ దేశం ఎక్కడుంది అనే ప్రశ్నతో అమెరికన్లు వెతుకుతున్నారు. అంతేకాదు, ఉత్తర కొరియా ఎక్కడ ఉంది?, సింగపూర్ ఓ దేశమా?, సింగపూర్ చైనా లేదా జపాన్‌లో ఉందా? అని వెతికారు.

ఎక్కువ మంది అమెరికన్లకు పాస్‌పోర్టులు లేవు
సమాచారం మేరకు 40 శాతానికి పైగా అమెరికన్లకు మాత్రమే పాస్‌పోర్టులు ఉన్నాయి. అంటే పాస్‌పోర్ట్ లేని వారు వారి దేశాన్ని దాటి వెళ్లని వారనే అర్థం. మరో ముఖ్య విషయం ఏమంటే ఉన్న పాస్‌పోర్టులలోను ఎక్కువ శాతం గత దశాబ్దకాలంలో తీసుకున్నవే కావడం గమనార్హం. ఇక్కడ మరో విషయం ఏమంటే పాస్‌పోర్టు లేకుండానే అమెరికన్లు మెక్సికో, కెనడాలకు ఇటీవలి వరకు ప్రయాణించారు.

సెర్చింజన్‌లో మరిన్ని
ట్రంప్ - కిమ్ భేటీ నేపథ్యంలో మరికొన్ని ప్రశ్నలను కూడా గూగుల్ సెర్చింజన్‌లో వెతికారు. కిమ్ జాంగ్ ఉన్న ఎంత పొడుగు ఉన్నాడు? కిమ్ జాంగ్ ఉన్ ఇంగ్లీష్ మాట్లాడగలరా? కిమ్ జాంగ్ ఉన్ - డొనాల్డ్ ట్రంప్ భేటీ ప్రస్తుతానికి బాగానే కనిపిస్తోంది. శాంతిచర్చలు ముందుకు సాగుతున్నట్లుగా ఉన్నాయి.

ఆసక్తిగా చూసిన కొరియన్ అమెరికన్లు
డొనాల్డ్ ట్రంప్ - కిమ్ జాంగ్ ఉన్ సమ్మిట్‌పై కొరియన్ అమెరికన్లు కూడా ఎంతో ఆసక్తిగా ఉన్నారు. అమెరికాలో దాదాపు 1.7 మిలియన్ల కొరియన్ అమెరికన్లు ఉంటున్నారు. కాగా, ఉత్తర కొరియా, అమెరికాల మధ్య ఎట్టకేలకు కీలక ఒప్పందం జరిగింది. ట్రంప్, కిమ్ మధ్య సింగపూర్‌లోని సెంటోసా ఐల్యాండ్‌లో కేపెల్లా హోటల్లో భేటీ అనంతరం ఇరువురు చారిత్రాత్మకమైన ఒప్పందంపై సంతకాలు చేశారు కూడా.
-
Donald Trump: పీకల్లోతు కష్టాల్లో ట్రంప్-స్వదేశంలో భారీ షాక్..! -
ఇరాన్ సుప్రీం లీడర్ గా ట్రంప్ ? అమెరికా అధ్యక్షుడి తాజా షాక్..! -
మడమ తిప్పని ఇరాన్: శాంతి కోసం 5 కండీషన్లతో అమెరికాకు షాక్ -
ట్రంప్ సీజ్ ఫైర్ కు నో..! మళ్లీ తీవ్రస్థాయికి ఇరాన్ వార్...! -
అంతా అయిపోయింది- డొనాల్డ్ ట్రంప్ -
ఇకపై నెలకు రెండు సిలిండర్లే..కొత్త బుకింగ్ రూల్స్ -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..!












Click it and Unblock the Notifications