గెలవాలంటే..: ఒబామాకు మద్దతిచ్చిన వారు హిల్లరీని దెబ్బతీస్తారా?

వాషింగ్టన్: డెమోక్రటిక్ అభ్యర్థి హిల్లరీ క్లింటన్ కంటే రిపబ్లికన్ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్‌కు తెల్లజాతీయులు ఎక్కువగా మద్దతు పలుకుతున్నారు. ఆఫ్రో - అమెరికన్ ఓటర్లు ఈ ఎన్నికల పైన ఆసక్తితో లేరు. గత ఎన్నికల్లో వారు భారీగా ఓటింగులో పాల్గొని బరాక్ ఒబామాకు అండగా నిలిచారు. ఈసారి వీళ్లు తక్కువ సంఖ్యలో ఓటింగులో పాల్గొంటే హిల్లరీ గెలుపు అవకాశాలు తగ్గుతాయని అంటున్నారు.

మరోవైపు, లాటిన్ అమెరికా దేశాల నుంచి వలస వచ్చిన వారు కూడా ఈ ఎన్నికల్లో క్రియాశీలకంగా మారారు. వారు ఎవరి వైపు మొగ్గు చూపితే వారికి అవకాశాలు ఎక్కువ. మెక్సికో నుంచి వస్తున్న వారి పైన ట్రంప్ వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం హిల్లరీకి అనుకూలంగా మారింది.

Presidential Election: Voters Decide Between Donald Trump and Hillary Clinton

ఫ్లోరిడా, పెన్సిల్వేనియా, నార్త్ కరోలినాల పైన హిల్లరీ, ట్రంప్.. ఇరువురు కూడా ప్రత్యేక దృష్టి పెట్టారు. ట్రంప్‌కు ఆధిక్యం రావాలంటే నార్త్ కరొలినా, అరిజోనా రాష్ట్రాల్లో మెజార్టీ సీట్లు సాధించాలి. గత ఎన్నికల్లో రిపబ్లికన్‌ పార్టీ అభ్యర్థి మిట్‌ రోమ్నీకి ఈ రెండు రాష్ట్రాలు గత ఎన్నికల్లో మద్దతు పలికాయి.

రివర్స్: హిల్లరీకి 'తొలి' షాక్, న్యూహ్యాంప్‌షైర్‌లో ట్రంప్ ముందంజఫ్లోరిడా, ఒహయో, అయోవా రాష్ట్రాల్లోనూ ట్రంప్‌ ఆధిక్యం సాధించాలి. పెన్సిల్వేనియాలో 20 ఎలక్ట్రోరల్ ఓట్లు ఉన్నాయి. ఇది కూడా కీలక రాష్ట్రమే. హిల్లరీకి పెన్సిల్వేనియా, మిచగన్‌, విస్కన్‌సిన్‌లు కీలక రాష్ట్రాలు. ఇవి డెమోక్రాట్లకు పెట్టని కోటలు.

ఈ కారణంగానే ట్రంప్‌ మూడు రాష్ట్రాలపై ఎక్కువగా దృష్టి పెట్టారు. అయితే మూడు రాష్ట్రాల్లోనూ ఓటర్లు ముందస్తు ఓటింగ్ వైపు ఎక్కువగా వెళ్లలేదు. పోలింగ్‌ తేదీన తమ ఓటు హక్కు వినియోగించుకుంటామన్నారు. ఈ మూడు రాష్ట్రాలతో పాటు నార్త్‌ కరొలినా, ఫ్లోరిడా, ఒహయో రాష్ట్రాల్లో కనీసం ఒక్క రాష్ట్రంలో క్లింటన్‌ మెజార్టీ సాధిస్తే ఆమె విజయావకాశాలు మరింత మెరుగవుతాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+