‘భీమ్’ యాప్ వినియోగదారులకు.. ప్రధాని బంపర్ ఆఫర్
‘భీమ్’వినియోగదారులకు ప్రధాని నరేంద్ర మోడీ ఓ బంపర్ ఆఫర్ ప్రకటించారు. ఈ యాప్‌ను రిఫర్ చేసే ప్రతి యూజర్ అకౌంట్‌కు రూ.10 జమవుతుందన్నారు.
నాగపూర్: డిజిటల్ పేమెంట్ ప్లాట్‌ఫామ్ 'భీమ్'వినియోగదారులకు ప్రధాని నరేంద్ర మోడీ ఓ బంపర్ ఆఫర్ ప్రకటించారు. ఓ వినియోగదారుడు మరో వ్యక్తిని ఈ యాప్‌కు యాడ్ చేస్తే, అలా జోడింపబడిన వ్యక్తి మూడు లావాదేవీలు నిర్వహిస్తే.. జోడించిన వినియోగదారుడి అకౌంట్‌కు రూ.10 జమవుతాయని వెల్లడించారు.
ఈ ఆఫర్ అక్టోబర్ 14 వరకు కొనసాగుతుందని ప్రధాని ప్రకటించారు. బీఆర్ అంబేద్కర్ 126వ జయంతి సందర్భంగా శుక్రవారం నాగపూర్‌లో ఆయన డిజిటల్ పేమెంట్స్ కోసం కొత్తగా భీమ్-ఆధార్ ప్లాట్‌ఫామ్‌ను ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా మోడీ మాట్లాడుతూ ఆర్థికంగా వెనుకబడినవారిని పైకి తీసుకురావడమే డిజిటల్ ఇండియా ప్రధాన ఉద్దేశమని స్పష్టంచేశారు. బీఆర్ అంబేద్కర్ ప్రజలకు ఎన్నో హామీలు ఇచ్చారు. మేము వాటిని అందుకోవడానికి ప్రయత్నిస్తాం. డిజిధన్ పేదలను శక్తివంతులను చేస్తుంది. ఇది అవినీతికి వ్యతిరేకంగా జరుగుతున్న స్వచ్ఛమిషన్ అని మోడీ అన్నారు.

భీమ్ యాప్‌ను రిఫర్ చేసే ప్రతి యూజర్ అకౌంట్‌కు రూ.10 జమవుతుందని ఆయన చెప్పారు. అంతకుముందు అంబేద్కర్ విగ్రహానికి మోడీ నివాళులర్పించారు. 1956, అక్టోబర్ 14న అంబేద్కర్‌తోపాటు ఆయన ఆరు లక్షల మంది అనుచరులు బుద్ధిజాన్ని స్వీకరించిన దీక్షాభూమిని కూడా ప్రధాని సందర్శించారు.
ప్రపంచ చరిత్రలో ఇంత మంది ఒకేసారి మతం మారిన ఘటన మరొకటి లేదు. దీక్షాభూమికి ప్రధానితోపాటు కేంద్ర మంత్రి రాందాస్ అథవాలె, మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ వెళ్లారు. అక్కడున్న అంబేద్కర్ విగ్రహానికి కూడా మోడీ పూలమాల వేసి నివాళులర్పించారు.
-
Work From Home ఇచ్చేశారు. ప్రభుత్వం, ఐటీ దిగ్గజాల కీలక ప్రకటన! -
తమిళ నాట అధికారం వారిదే, విజయ్ కు దక్కే సీట్లెన్ని- తేల్చేసిన కేకే సర్వే..!! -
అంచనాలను తలకిందులు చేస్తోన్న బంగారం ధరలు -
2024 నాటి భీభత్సం మళ్లీ వస్తుంది: ఈ వేసవి చాలా కాలం ఉంటుంది! -
ఇన్నాళ్లూ ఆచితూచి- ఇప్పుడు ప్రధాని మోదీపై సీఎం డైరెక్ట్ అటాక్? -
ICC T20I ర్యాంకింగ్స్: దూసుకొచ్చిన సంజూ, ఇషాన్ - అభిషేక్ ఏ స్థానంలో..!! -
ఉగాది నుంచి మిథున రాశి, కర్కాటక రాశి వారి జాతక ఫలం -
తెలంగాణ నూతన డీజీపీ ఖరారు, అనూహ్య ఎంపిక..!! -
న్యూజిలాండ్ ఫస్ట్ సిరీస్- టీ20 వరల్డ్ కప్ ఫైనల్ తర్వాత జట్టులో భారీ మార్పలు -
దేశంలో తొలి `కారుణ్య మరణం`- తీర్పు చెబుతూ కన్నీళ్లు పెట్టిన సుప్రీంకోర్టు ధర్మాసనం -
"ఆయన్ను తట్టుకోలేక నరకం చూశా.. 16 సినిమాలు తిరస్కరించా" -
రిలయన్స్ ఇండస్ట్రీస్ బంపర్ ఆఫర్ ఇచ్చిన డొనాల్డ్ ట్రంప్












Click it and Unblock the Notifications