స్టెప్పులు వేసిన బ్రిటన్ ప్రధాని థెరిస్సా మే, డ్యాన్స్ వీడియో వైరల్
లండన్: బ్రిటన్ ప్రధాని థెరిస్సా మే మరోసారి డ్యాన్స్ చేసి ఆకట్టుకున్నారు. ఆఫ్రికా పర్యటనలో ఆమె స్టెప్పులు వేశారు. ఇందుకు సంబంధించిన వీడియో నెట్లో వైరల్ అవుతోంది.
ఆఫ్రికా పర్యటనలో ఉన్న ఆమె, ఇందులో భాగంగా కెన్యాలోని యూఎన్‌ఓకు చెందిన నైరోబీ క్యాంపస్‌లో సందడి చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో కెన్యా స్కౌట్స్‌తో కలిసి కాలు కదిపారు.

గురువారం ఈ వీడియోలను షేర్ చేయగా ఇప్పటికే వేలమంది షేర్ చేశారు. ఆమె డ్యాన్స్ చేయడం ఇది తొలిసారి కాదు. కొద్ది రోజుల క్రితం ఈమె సౌత్ ఆఫ్రికా పర్యటనలో భాగంగా కేప్‌టౌన్‌కు వెళ్లారు. అక్కడ ఓ స్కూల్లో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆమె డ్యాన్స్ చేశారు.












Click it and Unblock the Notifications