పార్కర్‌తో ప్రేమ: పెళ్లికి ముందే డయానాను చార్లెస్ వద్దనుకున్నాడు

లండన్: పెళ్లికి ముందే ప్రిన్సెస్ డయానాతో సంబంధాలను తెగతెంపులు చేసుకోవాలని ప్రిన్స్ చార్లెస్ భావించారని చార్లెస్ అనధికార జీవిత చరిత్ర తెలియజేస్తోంది. మరో రెండురోజుల్లో మార్కెట్‌లోకి రానున్న చార్లెస్: హార్ట్ ఆఫ్ కింగ్ అనే జీవిత చరిత్రలో ఆ విషయం వెల్లడైంది. వివాహ సందర్భంలోనే వివిధ కారణాల వల్ల డయానాతో ఉన్న సంబంధాలకు ముగింపు పలకాలని అనుకున్నారని చార్లెస్‌కు విశ్వాసపాత్రుడైన ఓ వ్యక్తి వెల్లడించినట్లు ప్రిన్స్ జీవిత చరిత్రలో రచయిత క్యాథరీన్ మేయర్ చెప్పారు.

అప్పటికే కెమిల్లా పార్కర్ బొవ్లెస్‌తో చార్లెస్ ప్రేమలో పడ్డారని, అయితే ఓ మోస్తారుగా పరిచయమున్న డయానాతో పెండ్లికి సిద్ధమవ్వడంతో కెమిల్లా ఆందోళనకు లోనైనట్లు పుస్తకంలో రాశారని టెలిగ్రాఫ్ ఓ వార్తాకథనాన్ని ప్రచురించింది. 1981 సంవత్సరంలో బ్రిటన్ సింహాసనాన్ని ఎలాగైనా అధిష్ఠించాలనే తెగింపుతో యువరాజు ఉన్నారని ఛార్లెస్ సన్నిహితుడు వెల్లడించారు.

Prince Charles was doubtful about his marriage to Princess Diana

అధికారికంగా నిశ్చితార్థం జరిగిన ఐదు నెలల తర్వాత డయానా తన అంచనాలకు, అభిరుచులకు తగినట్లు లేకపోవడంతో తీవ్ర అసంతృప్తికి లోనయ్యారని, అంతేకాకుండా తినడానికి సంబంధించిన లోపాలతో డయానా బాధపడుతుండటం వల్ల చార్లెస్‌కు అనేక చిక్కులెదురయ్యాయని తెలిపారు. దాంతో డయానాతో వివాహాన్ని రద్దు చేసే ఆలోచనలో పడ్డారని, అయితే క్యాథలిక్ వివాహమైతే రద్దు చేయడానికి అవకాశం ఉంటుందని తాను తెలిపినట్లు సన్నిహితుడు వెల్లడించారు.

దాంతో తప్పనిసరి పరిస్థితుల్లో డయానా, ప్రిన్స్‌ల వివాహం జరిగిందని తెలిపారు. ఇదిలా ఉండగా, కెమిల్లా పార్కర్ కోసం ఇవ్వడానికి తెచ్చిన జీఎఫ్ అని చెక్కి ఉన్న బ్రాస్‌లెట్ డయానా కంటపడిందని, ప్రిన్స్‌కు గ్లాడీస్, కెమిల్లాకు ఫ్రెడ్ అని ముద్దు పేర్లు ఉండటం ఆమెలో అనేక అనుమానాలకు దారి తీసిందన్నారు. ఈ జీవిత చరిత్ర గురువారం ఫిబ్రవరి 5 తేదీన మార్కెట్‌లోకి రానుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+