తాత పోలికలే.. రాజుగారి మనవడి అద్భుత సృష్టి.. యువరాజు గీసిన ఈ బొమ్మ చూశారా?

బ్రిటన్ రాజకుటుంబంలో కళాత్మక వారసత్వం మరో తరానికి బదిలీ అవుతోంది. తాత కింగ్ చార్లెస్ అడుగుజాడల్లో నడుస్తూ యువరాజు జార్జ్ తనలోని అద్భుతమైన చిత్రకళా నైపుణ్యాన్ని ప్రపంచానికి పరిచయం చేశాడు. కేవలం 13 ఏళ్ల వయసులోనే అతడు గీసిన ఓ అందమైన కింగ్‌ఫిషర్ పక్షి చిత్రం ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తోంది.

తండ్రి ప్రిన్స్ విలియం స్వయంగా ఎడిట్ చేసిన 'కంట్రీ లైఫ్' మ్యాగజైన్ ప్రత్యేక సంచికలో యువరాజు జార్జ్ గీసిన ఈ కలర్ ఫుల్ పెయింటింగ్ పబ్లిష్ అయింది. కింగ్‌ఫిషర్ పక్షి ఒక కొమ్మపై వాలి ఉన్నట్లుగా గీసిన ఈ చిత్రం అద్భుతంగా ఉంది. నిజానికి ఈ చిత్రాన్ని జార్జ్ 12 ఏళ్ల వయసులో, అంటే 2026 వింటర్ లో విండ్సర్‌లోని తమ నివాసం 'ఫారెస్ట్ లాడ్జ్'లో గీశాడట. కింగ్‌ఫిషర్ పక్షికే సొంతమైన బ్లూ, ఆరెంజ్ రంగుల ఈకలను రంగుల పెన్సిళ్లతో ఎంతో సున్నితంగా, సహజంగా తీర్చిదిద్దిన తీరు ప్రతి ఒక్కరినీ ఆకట్టుకుంటోంది.

Prince George Displays Artistic Talent with Stunning Kingfisher Drawing in Country Life Magazine Issue

పబ్లిష్ కు యువరాజు అంగీకారం..

ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, ఈ చిత్రాన్ని జార్జ్ ఏదో పత్రికలో ప్రచురించాలనో లేక ప్రదర్శన కోసమో గీయలేదు. కేవలం తన వ్యక్తిగత ఆసక్తితో గీసుకున్న ఈ చిత్రం.. అనుకోకుండా తండ్రి ప్రిన్స్ విలియం కంట పడింది. తాను ఎడిట్ చేస్తున్న మ్యాగజైన్‌లో ఆ చిత్రాన్ని ప్రచురించాలని భావించిన విలియం.. వెంటనే కొడుకు అనుమతి కోరడం, దానికి జార్జ్ అంగీకరించడం జరిగిపోయాయని కెన్సింగ్టన్ ప్యాలెస్ ప్రతినిధి ఒకరు ధృవీకరించారు.

భయపడిన యువరాజు.. ప్యాలెస్‌లు వదిలి బంకర్లలోకి
భయపడిన యువరాజు.. ప్యాలెస్‌లు వదిలి బంకర్లలోకి

తాత పోలికలేనా..?

ఈ పెయింటింగ్ చూడగానే అందరికీ కింగ్ చార్లెస్-3 గుర్తుకొస్తున్నారు. ఆయనకు పెయింటింగ్స్ అంటే, మరీ ముఖ్యంగా వాటర్ కలర్స్ అంటే ఎంత ఇష్టమో అందరికీ తెలిసిందే! ఒకవైపు రాజరికపు బాధ్యతలు నిర్వహిస్తూనే.. మరోవైపు ఆర్టిస్ట్‌గా ఆయన ఎన్నో అద్భుతమైన చిత్రాలు వేశారు. ఇప్పుడు మనవడు జార్జ్ కూడా తాతలాగే కుంచె పట్టి తనలోని కళాభిరుచిని చాటుకుంటున్నాడు. జార్జ్‌కు బొమ్మలు గీయడం అంటే చాలా ఇష్టమని, భవిష్యత్ రాజులో ఉన్న ఈ సృజనాత్మకతను ప్రపంచానికి పరిచయం చేయడం సంతోషంగా ఉందని కెన్సింగ్టన్ ప్యాలెస్ వర్గాలు తెలిపాయి.

ఏడేళ్ల నిరీక్షణకు తెర.. లండన్ బాట పట్టిన యువరాజు, యువరాణి
ఏడేళ్ల నిరీక్షణకు తెర.. లండన్ బాట పట్టిన యువరాజు, యువరాణి

ఆ ప్రత్యేక సంచికలో ఏమున్నాయంటే?

దాదాపు 300 పేజీలతో నవంబర్ 2026లో వెలువడిన ఈ 'కంట్రీ లైఫ్' స్పెషల్ ఎడిషన్ కోసం ప్రిన్స్ విలియం దాదాపు ఆరు నెలల పాటు శ్రమించాడు. ప్రకృతి, వన్యప్రాణులు, గ్రామీణ జీవనం పట్ల ఆయనకున్న మక్కువ ఈ మ్యాగజైన్‌లో స్పష్టంగా కనిపిస్తుంది. అంతేకాకుండా తన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన విషయాలు, ఆస్టన్ విల్లా ఫుట్‌బాల్ క్లబ్‌పై ఉన్న ఇష్టం, కుటుంబంతో కలిసి ఆరుబయట గడిపిన మధుర క్షణాలను కూడా ఇందులో పంచుకున్నాడు. ఇక ప్రిన్సెస్ ఆఫ్ వేల్స్ కేట్ మిడిల్టన్ కూడా ఈ మ్యాగజైన్‌కు ఇంటర్వ్యూ ఇచ్చారు. ప్రకృతి తన జీవితంలో ఎంత ముఖ్యమో, క్యాన్సర్ నుంచి తాను కోలుకోవడంలో అది ఎలా సహాయపడిందో ఆమె వివరించారు. ఈ ప్రకృతి నేపథ్యానికి సరిపోయేలా జార్జ్ గీసిన కింగ్‌ఫిషర్ చిత్రం కూడా అందులో చోటు దక్కించుకోవడం విశేషం.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+