స్కూల్ కెళ్లనున్న లండన్ బుల్లి యువరాజు
లండన్: బ్రిటన్ రాజకుటుంబానికి చెందిన బుల్లి యువరాజు పాఠశాల చదువుకు సర్వం సిద్దం చేస్తున్నారు. ప్రిన్స్ విలియమ్, కేట్ మిడీల్టన్ దంపతుల తొలి సంతానమైన ప్రిన్స్ జార్జ్ (బుల్లి యువరాజు) అతి త్వరలో స్కూల్ లో అడుగు పెట్టనున్నాడు.
జార్జ్ వయస్సు రెండున్నర సంవత్సరాలు. ఇప్పుడే తమ కుమారుడిని స్కూల్ కు పంపించాలని రాజదంపతులు ఓ నిర్ణయం తీసుకున్నారు. జార్జ్ నర్సరీ విద్యను మొదలు పెడుతున్నారని కన్సింగ్ టన్ రాజప్రసాదానికి చెందిన ఓ సీనియర్ అధికారి వెల్లడించారు.
2016 జనవరిలో యువరాజు విద్యభ్యాసం ప్రారంభం అవుతుందని ఆయన చెప్పారు. లండన్ తూర్పు వైపున 110 మైళ్ల దూరంలో ఉన్న నార్ ఫోల్క్ లోని వెస్టాక్రె మాంటెస్సోరి స్కూల్ లో యువరాజును చేర్పించడానికి ఏర్పాట్లు పూర్తి అయ్యాయి.

ఈ పాఠశాల బుల్లి యువరాజుకు స్వాగతం పలకడానికి సిద్దం అయ్యింది. తమ పాఠశాలలో ఇతర విద్యార్థుల మాదిరిగానే బుల్లి యువరాజు హాయిగా, సంతోషంగా ఉంటాడని ఆశిస్తున్నామని పాఠశాల యాజమాన్యం తెలిపింది.
క్రిస్మస్ పండుగ సందర్బంగా రాజదంపతులు తమ ఇద్దరి పిల్లలతో కలిసి తీయించుకున్న ఓ ఫోటోను అధికారికంగా విడుదల చేశారు. అందులో రాజ దంపతులతో పాటు యువరాజు జార్జ్, జార్జ్ ఆరు నెలల చెల్లి ఉన్నారు.












Click it and Unblock the Notifications