పైలెట్ ఉద్యోగాన్ని వదులుకొన్న బ్రిటన్ యువరాజు విలియం
రాచరిక బాధ్యతలను సక్రమంగా నిర్వహించేందుకు వీలుగా పైలెట్ ఉద్యోగాన్ని వదులుకొన్నాడు బ్రిటన్ యువరాజు విలియమ్. రెండేళ్ళుగా ఆయన కేంబ్రిడ్జి ఎయిర్‌పోర్ట్‌లో ఎయిర్ అంబులెన్స్ పైలెట్‌గా విధులు .
లండన్: రాచరిక బాధ్యతలను సక్రమంగా నిర్వహించేందుకు వీలుగా పైలెట్ ఉద్యోగాన్ని వదులుకొన్నాడు బ్రిటన్ యువరాజు విలియమ్. రెండేళ్ళుగా ఆయన కేంబ్రిడ్జి ఎయిర్‌పోర్ట్‌లో ఎయిర్ అంబులెన్స్ పైలెట్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు. డ్యూక్ ఆఫ్ కేంబ్రిడ్జిగా పిలుచుకొనే ప్రిన్స్ విలియం బ్రిటన్ సింహసనానికి తదుపరి వారసుడు.
అత్యవసర పరిస్థితుల్లో స్పందించి ప్రజల ప్రాణాలను కాపాడే బాధ్యతను తీసుకొన్న ఎయిర్ అంబులెన్స్‌లో పనిచేయడం తీయని గుర్తుగా ప్రిన్స్ అభిప్రాయపడుతున్నారు.

పైలెట్‌గా తనకు తోటి ఉద్యోగులు ఇచ్చిన సహకారం మరువలేనిదన్నారు. ఉద్యోగిగా ఆయనన్ను తోటివారు పైలెట్ విలియమ్ వేల్స్‌గా పిలిచేవారు. తన బృందంలోని మరో నలుగురితో కలిసి రోజులో తొమ్మిదిన్నరగంటల డ్యూటీ చేశారు. ఈ సర్వీస్‌కు రెండు వేలకు పైగా కాల్స్ వచ్చేవని సమాచారం.
విధి నిర్వహణకు గాను ప్రిన్స్ అందుకొన్న వేతనం మొత్తాన్ని ఎయిర్ అంబులెన్స్ చారిటీకే అందజేశారు. రాజకుటుంబ బాధ్యతల నిర్వహణకు వీలుగా వచ్చే సెప్టెంబర్‌లో లండన్‌లోని కెన్సింగ్టన్ ప్యాలెస్‌కు మకాం మార్చనున్నారు. అక్కడే తమ పిల్లలు ప్రిన్స్ జార్జి రాణి షార్లెట్‌ను జార్జి స్టార్స్ స్కూల్‌లో చేర్పించనున్నారు. ప్రిన్స్ విలియ్ కేట్ దంపతులు నాయనమ్మ , క్వీన్ ఎలిజబెత్-2 తాత ఫిలిఫ్ తరపున బాధ్మతలు చేపట్టనున్నారు.
-
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
ఇరాన్ ను లేపేద్దాం రండి: ప్రపంచ దేశాలకు నెతన్యాహు పిలుపు -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
క్రికెట్ రాజకీయాలకు బలైన రియల్ లైఫ్ 'ధురంధర్' ఆదిత్య ధర్! -
విజయ్ సంచలనం.. టీవీకే అభ్యర్థుల ఫుల్ జాబితా విడుదల.. -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
India Post GDS 2nd merit list 2026: పోస్టల్ జాబ్స్ సెకండ్ మెరిట్ లిస్ట్ పై అప్డేట్..!












Click it and Unblock the Notifications