వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ప్రిన్సెస్‌ శృంగార జీవిత రహస్యాలు వెలుగులోకి! రాచకుటుంబం వద్దంటున్నా.. చానల్ 4 ససేమిరా!

ప్రిన్సెస్‌ డయానాకు చెందిన ప్రైవేట్‌ టేపులను విడుదల చేసేందుకు అంతా సిద్ధమైంది. రాయల్‌ కుటుంబం వద్దని వారిస్తున్నా లెక్కచేయకుండా బ్రిటన్‌కు చెందిన బ్రాడ్‌ కాస్టర్‌ చానల్‌ 4 ఆదివారం వాటిని బహిర్గతం.

By Ramesh Babu
|
Google Oneindia TeluguNews

లండన్: ప్రిన్సెస్‌ డయానాకు చెందిన ప్రైవేట్‌ టేపులను విడుదల చేసేందుకు అంతా సిద్ధమైంది. రాయల్‌ కుటుంబం వద్దని వారిస్తున్నా లెక్కచేయకుండా బ్రిటన్‌కు చెందిన బ్రాడ్‌ కాస్టర్‌ చానల్‌ 4 ఆదివారం వాటిని బహిర్గతం చేయడానికి ప్రయత్నిస్తోంది.

అయితే, వీటిని బహిర్గతం చేయొద్దంటూ ఇప్పటికే రాచ కుటుంబంతోపాటు డయానా కుటుంబ సభ్యులు, స్నేహితులు, మాజీ అధికారులు చెబుతున్నప్పటికీ సదరు టీవీ చానల్‌ మాత్రం ససేమిరా అంటోంది. వాటిని విడుదల చేసేందుకు ప్రయత్నాలు చేస్తోంది.

Princess Diana’s private tapes will air despite pleas from her family and friends

టీవీ డాక్యుమెంటరీ రూపంలో ఉన్న ఈ ప్రైవేట్‌ టేపుల్లో డయానా వ్యక్తిగత లైంగిక జీవితం, వివాహం తర్వాత ప్రిన్స్‌ చార్లెస్‌ పట్ల ఉన్న అసంతృప్తి వంటి తదితరమైన అంశాలన్నీ కూడా ఈ టేపుల్లో ఉన్నాయి.

దీంతో ప్రస్తుతం రాయల్‌ కుటుంబం ఆలోచనలో పడింది. అనుమానాస్పద స్థితిలో ప్రిన్సెస్‌ డయానా రోడ్డు ప్రమాదంలో చనిపోయిన విషయం తెలిసిందే. అయితే, అంతకుముందే తన భర్త ప్రిన్స్‌ చార్లెస్‌తో ఆమె తీవ్ర అసంతృప్తితో ఉండేది. లైంగిక జీవితం కూడా చాలా ఇబ్బందికరంగా ఉందంటూ పలుమార్లు ఆమె చెప్పినట్లు కథనాలు వచ్చాయి.

అయితే, పలుటీవీ చానళ్లు, రేడియో సంస్థలు ఆమె బతికున్న రోజుల్లో ఆమె వ్యక్తిగత జీవితానికి సంబంధించిన వివరాలు తెలుసుకునేందుకు ఇంటర్వ్యూలు నిర్వహించాయి. వాటిల్లో కొన్ని ఇప్పటికే బయటకు రాగా ఇంకా రావాల్సినవి చాలా ఉన్నాయి.

వచ్చే నెలలో డయానా వర్థంతి నేపథ్యంలో ఆమె శృంగార జీవితానికి సంబంధించిన రహస్యాలను విడుదల చేసే ప్రయత్నాల్లో ఉంది చానల్‌ 4 సంస్థ. విశ్వసనీయ సమాచారం ప్రకారం చార్లెస్‌కు.. డయానాకు మధ్య ఏడేళ్లపాటు శృంగార జీవితం లేదనే విషయం కూడా ఈ టేపుల్లో ఉండనుందని తెలుస్తోంది.

హ్యారీ జన్మించిన తర్వాత వారిద్దరి మధ్య దూరం ఎలా పెరిగిందనే విషయాలు, ఆ తర్వాత ఒకరిపట్ల ఒకరు విద్వేషంగా ఎలా మారారనే విషయాలు కూడా ఇందులో తెలియనున్నాయట.

English summary
A British broadcaster will air a somewhat salacious TV documentary about the late Princess Diana on Sunday despite pleas from her family, friends and former courtiers to scuttle a program that includes clips of Diana discussing her sex life and unhappy marriage with Prince Charles. The British broadcaster Channel 4 defended the use of the private musings of Diana as an important historical document and said the recordings offered unique insights into her life as the anniversary of her death approaches later this month. Historical as the tapes may or may not be, the Daily Mail tabloid went with the headline: “Charles and Diana ‘didn't have sex for seven years’: How Prince transformed from being ‘all over his wife like a bad rash’ before their love life ‘fizzled out entirely’ after Harry was born.”
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X