ఎమర్జన్సీ ల్యాండింగ్ చేస్తుండగా కుప్పకూలిన విమానం..
ప్రపంచ వ్యాప్తంగా వరుసగా చోటు చేసుకుంటున్న ప్రమాదాలు ప్రజలకు భయాందోళన కలిగిస్తున్నాయి. ఓ వైపు రోడ్డు ప్రమాదాలు మాత్రమే అనుకుంటుంటే.. మరో వైపు రైలు ప్రమాదాలు, విమాన ప్రమాదాలు సైతం జరిగి పదుల సంఖ్యలో ప్రజలు ప్రాణాలు కోల్పోతుండడం సర్వత్రా ఆవేదన నింపుతున్నాయి. ఇప్పుడు లేటెస్ట్ గా మెక్సికోలో ఘోర విమాన ప్రమాదం చోటుచేసుకుంది. ఎమర్జన్సీ ల్యాండింగ్ చేసేందుకు ప్రయత్నిస్తూ ఓ ప్రైవేట్ విమానం కుప్పకూలిన ఘటనలో ఏడుగురు దుర్మరణం పాలయ్యారు.
అసలేం జరిగిందంటే..?
పసిఫిక్ తీరంలోని అకాపుల్కో నుంచి ఇద్దరు సిబ్బంది, ఎనిమిది మంది ప్రయాణికులతో ఓ విమానం బయల్దేరింది. అయితే పలు కారణాలతో అత్యవసరంగా ల్యాండ్ చేయాల్సి వచ్చింది. దాంతో సమీపంలోని సాకర్ మైదానంలో విమానాన్ని ల్యాండ్ చేసేందుకు ప్రయత్నించారు. ఈ క్రమంలోనే అదుపుతప్పిన విమానం ఓ భవనం పైకప్పును బలంగా ఢీ కొట్టింది. దీంతో ఒక్కసారిగా భారీగా మంటలు చెలరేగాయి.

టొలుకా ఎయిర్‌పోర్ట్‌కు సమీపంలోని శాన్ మాటియో అటెంకో అనే పారిశ్రామిక ప్రాంతంలో ఈ దుర్ఘటన జరిగింది. ప్రమాదం జరిగిన చాలా గంటల తర్వాత కూడా ఏడు మృతదేహాలను మాత్రమే గుర్తించినట్లు అధికారులు తెలిపారు. ఈ విషయాన్ని మెక్సికో స్టేట్ సివిల్ ప్రొటెక్షన్ కోఆర్డినేటర్ అడ్రిన్ హెర్నాండెజ్ అధికారికంగా ధ్రువీకరించారు.
అయితే ముందు జాగ్రత్త చర్యగా ప్రమాద స్థలం నుంచి సుమారు 130 మందిని ఖాళీ చేయించినట్లు మేయర్ అనా మునిజ్ వెల్లడించారు. ప్రమాదానికి గల కారణాలపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్టు అధికారులు వెల్లడించారు.
A Cessna Citation 3 crashed while attempting a go around, in Toluca, Mexico , 10 people dead, including crew.
— Aviation Daily (@aeroworldx) December 15, 2025
Investigation is underway… pic.twitter.com/gzrAExEZ44












Click it and Unblock the Notifications