వామ్మో.. వీడు మామూలోడు కాదు.. పదహారేళ్లకే.. అధికారులే అవాక్కయ్యేలా..

అతడి పేరు కానర్‌ టాట్రో. వయసు పదహారే. కానీ అతడు చేసిన పనులు వింటే మాత్రం నోరెళ్ల బెట్టాల్సిందే. చదువుకోసమని తల్లిదండ్రులు క్యాంపస్‌లో చేర్పిస్తే అది తప్ప మిగతా చెడుపనులన్నీ చేశాడు.

న్యూయార్క్‌: అతడి పేరు కానర్‌ టాట్రో. వయసు పదహారే. కానీ అతడు చేసిన పనులు వింటే మాత్రం నోరెళ్ల బెట్టాల్సిందే. చదువుకోసమని తల్లిదండ్రులు క్యాంపస్‌లో చేర్పిస్తే అది తప్ప మిగతా చెడుపనులన్నీ చేశాడు.

క్లాసులు జరుగుతున్న సమయంలో.. క్లాస్‌లు ముగిశాక అమ్మాయిల వెంటపడటం, ఏడిపించడమే పని. అవకాశం దొరకగానే లైంగికంగా వేధించేవాడు. అంతేకాదు, ప్రత్యేకంగా తానే వ్యూహాలు పన్ని ఎటూ వెళ్లలేని నిస్సహాయ పరిస్థితిని అమ్మాయిలకు సృష్టించి వారిని లోబర్చుకోవడం కూడా చేశాడు.

Private school boy, 16, 'sexually assaulted at least five female classmates

ఒకమ్మాయినైతే తనతో శృంగారానికి ఒప్పుకోలేదని తీవ్రంగా గాయపరిచాడు. ఎట్టకేలకు బాధితులు పోలీసులను ఆశ్రయించడంతో దర్యాప్తు చేపట్టిన అధికారులు అతడిని అదుపులోకి తీసుకున్నారు. విచారణలో అతడు తప్పిదాలకు పాల్పడిన విధానం అధికారులే షాకయ్యారు.

క్లాస్‌ రూముల్లో, బాత్‌ రూముల్లో, కేఫ్‌ టేరియాలో, స్కూల్‌ హాల్‌లోకి ప్రవేశించే మార్గాల్లో, బేస్‌ బాల్‌ మైదానాల్లో, క్యాంపస్‌ పరిధిలోని చెట్లు, పొదలు ఉన్న ప్రాంతాల్లో కానర్‌ టాట్రో దుశ్చేష్టలకు అడ్డూ అదుపులేకుండా పోయింది.

పలువురు అమ్మాయిలపై లైంగిక వేధింపులకు పాల్పడిన అతడు ఐదుగురు అమ్మాయిలపై మాత్రం ఏకంగా లైంగిక దాడికి పాల్పడ్డాడు. హర్రర్‌ చిత్రాల్లో ఓ సైకో మాదిరిగా పదహారేళ్లకే అతడు ప్రతీది పక్కా ప్లాన్‌ ప్రకారం చేసిన పనిని చూసి అధికారులే బిత్తరపోయారు.

కానర్‌ టాట్రోను అతడి తల్లిదండ్రులు థెట్ఫోర్డ్‌ అకాడమీలో చేర్పించారు. అయితే, అకాడమీలో చేరిన అతడు 15 నుంచి 16 సంవత్సరాల వయసు ఉన్న అమ్మాయిలనే టార్గెట్‌ చేసుకొని లైంగికదాడులు చేయడం మొదలు పెట్టాడు. ఈ కేసును విచారణ చేపట్టిన వర్మోంట్‌ సుపీరియర్‌ కోర్టు కూడా ఈ కేసు చాలా సీరియస్‌ అంటూ అభిప్రాయపడింది. చివరికి అతడిని దోషిగా ప్రకటించింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+