నీరవ్ మోడీకి బెయిల్ మంజూరు చేస్తే దేశం దాటి వెళ్లిపోతాడు: ఈడీ తరపున లాయర్
లండన్ : పంజాబ్ నేషనల్ బ్యాంకుకు కుచ్చుటోపీ పెట్టి లండన్‌కు పారిపోయిన ఆర్థిక నేరగాడు నీరవ్ మోడీని అక్కడి పోలీసులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే. ప్రస్తుతం జైలులో ఉన్న మోడీని వెస్ట్‌మినిస్టర్ మెజిస్ట్రేట్ ముందు హాజరుపరిచారు. తొలిసారి బెయిల్‌ను తిరస్కరించిన న్యాయస్థానం... బెయిల్ మంజూరు చేయాలంటూ రెండోసారి దరఖాస్తు చేసుకుని అదృష్టం పరీక్షించుకుంటున్నాడు నీరవ్ మోడీ.
భారత్ ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టొరేట్ ఈడీ తరపున వాదిస్తున్న క్రౌన్ ప్రాసెక్యూషన్ సర్వీస్... న్యాయస్థానం ముందు ఓ ఫైలును ఉంచింది. ఈ కేసును ఛీఫ్ మెజిస్ట్రేట్ ఎమ్మా ఆర్బత్‌నాట్ విచారణ చేస్తున్నారు. ఇదే జడ్జి లిక్కర్ బ్యారన్ విజయ్ మాల్యా కేసును కూడా గత డిసెంబరులో విచారణ చేసి తీర్పు చెప్పారు. ప్రస్తుతం ఆ ఫైలును జడ్జి పరిశీలిస్తున్నారు. దీన్ని నీరవ్ మోడీ ముందే సమీక్షిస్తారని తెలుస్తోంది.

భారత అధికారులు చేపడుతున్న విచారణకు నీరవ్ మోడీ సహకరించడం లేదని ఈడీ తరపున వాదిస్తున్న లాయర్ టోబీ క్యాడ్‌మ్యాన్ జడ్జి దృష్టికి తీసుకొచ్చారు. నీరవ్ మోడీ పాల్పడింది సాధారణమైన మోసం కాదని ఇదో హైప్రొఫైల్ కేసుగా పరిగణించాలని చెప్పారు. అంతేకాదు అతనికి బెయిల్ మంజూరు చేస్తే దేశం విడిచి పారిపోయే ప్రమాదం ఉందని జడ్జి దృష్టికి తీసుకొచ్చారు. కేసులో వాదనలు ప్రత్యక్షంగా వినేందుకు ఈడీ, సీబీఐ అధికారులు లండన్‌కు వెళ్లారు.
ఇదిలా ఉంటే నీరవ్ మోడీ తొలిసారి బెయిల్ కోసం దరఖాస్తు చేసుకోగా దాన్ని కోర్టు తిరస్కరించింది. ప్రస్తుతం హెఎంపీ వాండ్స్‌వర్త్ జైలులో జుడీషియల్ కస్టడీలో మోడీ ఉన్నాడు. గత వారం నుంచి మోడీ కస్టడీలో ఉన్నాడు. పంజాబ్ నేషనల్ బ్యాంకును మోసం చేసినందుకు, రెండు పాస్‌పోర్టులు కలిగి ఉన్నారన్న కేసులను లండన్ పోలీసులు నమోదు చేయడం జరిగింది. గతేడాది లండన్‌కు పారిపోయిన నీరవ్ మోడీ... అతని భారత పాస్‌పోర్టును రద్దు చేసినప్పటికీ కూడా... బ్రిటన్ నుంచి నాలుగు సార్లు ఇతర దేశాలకు వెళ్లి తిరిగి వచ్చాడు.
-
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
ఇరాన్ ను లేపేద్దాం రండి: ప్రపంచ దేశాలకు నెతన్యాహు పిలుపు -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
క్రికెట్ రాజకీయాలకు బలైన రియల్ లైఫ్ 'ధురంధర్' ఆదిత్య ధర్! -
విజయ్ సంచలనం.. టీవీకే అభ్యర్థుల ఫుల్ జాబితా విడుదల.. -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
India Post GDS 2nd merit list 2026: పోస్టల్ జాబ్స్ సెకండ్ మెరిట్ లిస్ట్ పై అప్డేట్..!












Click it and Unblock the Notifications