వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ట్రంప్ గెలుపును నిరసిస్తూ.. భారీ ఎత్తున రోడ్డెక్కిన ఆందోళనకారులు

|
Google Oneindia TeluguNews

న్యూయార్క్ : హిల్లరీ ఓటమిని జీర్ణించుకోలేని ఆమె మద్దతుదారులు రోడ్డుపైకెక్కి నిరసనలు చేస్తున్నారు. అంచనాలను తలకిందులు చేస్తూ.. అమెరికన్ అధ్యక్ష పీఠం ట్రంప్ ను వరించడంతో.. ఆయన వ్యతిరేకుల్లో ఆగ్రహావేశాలు కట్టలు తెంచుకుంది. ట్రంప్ అధ్యక్షుడిగా ఎన్నికయ్యారన్న వార్త వెలువడగానే.. బుధవారం తెల్లవారు జామున నిరసనకారులు రోడ్డెక్కారు.

కాలిఫోర్నియా నుంచి సీటెల్ వరకు ఆందోళన చేపట్టారు. దీంతో రోడ్లపై భారీగా ట్రాఫిక్ జామ్ అవగా.. పలుచోట్ల ఉద్రిక్త వాతావరణం నెలకొంది. కాలిఫోర్నియా పరిధిలోని ఓక్లాండ్ డౌన్ టౌన్ లో దాదాపు 100మంది నిరసనకారులు ఆందోళనకు దిగారు. ట్రంప్ కు వ్యతిరేకంగా నినాదాలను హోరెత్తించారు.

protesters take to the streets following trump win

ఆందోళనకారుల ర్యాలీతో టెలిగ్రాఫ్ అవెన్యూ సమీపంలోని ర్యాపిడ్ ట్రాన్సిట్ స్టేషన్ ను మూసివేశారు. ర్యాలీలో భాగంగా ట్రంప్ దిష్టి బొమ్మను తగలబెట్టారు. ఆందోళనకారులు స్థానిక ఇళ్లపై దాడులకు తెగబడుతున్నారంటూ అక్కడి మీడియా పేర్కొంది. సాన్ జోస్, బర్కెలీ వంటి ప్రాంతాల్లోను విద్యార్థులు వందల సంఖ్యలో రోడ్డెక్కి ట్రంప్ వ్యతిరేక నినాదాలు చేశారు.

అమెరికా అధ్యక్ష భవనానికి కూడా నిరసనకారుల సెగ తాకుతుంది. స్వేత సౌధం ఎదురుగా ట్రంప్ వ్యతిరేకులు ఆందోళన చేస్తున్నారంటూ ఫాక్స్ న్యూస్ వెల్లడించింది. అమెరికన్ అధ్యక్ష ఎన్నికలను తాము తిరస్కరిస్తున్నట్టుగా ఆందోళనకారులు వెల్లడించడం గమనార్హం.

English summary
Protesters angry about Donald Trump’s stunning presidential election victory over Hillary Clinton hit the streets from Southern California to the East Coast early Wednesday,
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X