దాటేసింది: యూట్యూబ్‌లో 'గ్యాంగ్నమ్ స్టైల్' రికార్డ్

న్యూఢిల్లీ: కొరియాకు చెందిన పాప్ స్టార్ సెన్షేషన్ 'సై' 'గ్యాంగ్నమ్ స్టైల్' యూట్యూబ్‌లో రికార్డ్ సృష్టించింది. గ్యాంగ్నమ్ స్టైల్ పాటతో 2012లో 'సై'అంతర్జాతీయ చార్టుల్లో ఉర్రూతలూగించింది. విడుదలై రెండు సంవత్సరాలైన తరువాత కూడా ఇప్పటికీ ఆ పాటకు పాప్యులారిటీ ఏ మాత్రం తగ్గలేదు.

Psy's Gangnam Style breaks YouTube view limits!

తాజాగా యూట్యూబ్‌లో ఆ వీడియో మాగ్జిమమ్ వ్యూ లిమిట్స్‌ని బ్రేక్ చేసిందంట. అంతర్జాతీయ వెబ్‌సైట్స్ సమాచారం ప్రకారం ఈ నెల 4 వరకు ఆ పాటను 214,74,83,647 మంది చూశారట. వీడియో షేరింగ్ సైట్‌లో ఓ వీడియోను ఈ స్థాయిలో చూడటం గమనార్హం.

డిసెంబర్ 21, 2012 విడుదలైన గ్యాంగ్నమ్ స్టైల్ పాట వీడియో యుట్యూబ్‌లో బిలియన్ వ్యూస్ సొంతం చేసుకున్న తొలి గీతంగా రికార్డులకెక్కింది. ఈ పాట పాప్యులారిటీ పరంగా జస్టిన్ బీబర్ బేబీ పాటను ద్వితీయ స్థానానికి నెట్టింది. గ్యాంగ్నమ్ స్టైలర్ తన క్విక్‌నెస్, వినూత్న డ్యాన్స్‌తో అందర్నీ అలరించింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+