పుల్వామా తీవ్రవాద దాడి: స్పందించిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్

వాషింగ్టన్: జమ్ము కాశ్మీర్‌లోని పుల్వామా తీవ్రవాద దాడిపై అమెరికా అధ్యక్షులు డొనాల్డ్ ట్రంప్ స్పందించారు. ఇది తీవ్రమైన అంశమని అభిప్రాయపడ్డారు. దాడిపై తమకు నివేదికలు అందాయని, తాను వాటిని పరిశీలించానని, అక్కడి పరిస్థితులు భయానకంగా ఉన్నాయని చెప్పారు. ఈ అంశంపై సరైన సమయంలో స్పందిస్తామని చెప్పారు.

భారత్, పాకిస్తాన్‌లు కలిసి ముందుకు నడిస్తే బాగుంటుందని వ్యాఖ్యానించారు. ఈ నెల 14వ తేదీన జైష్ ఎ మొహమ్మద్ ఉగ్రవాది దాడిలో 40 మందికి పైగా జవాన్లు అమరులైన విషయం తెలిసిందే. దీనిని ప్రపంచ దేశాలు తీవ్రంగా ఖండించాయి. తాజాగా, అమెరికా అధ్యక్షుడు స్పందించారు.

Pulwama attack: Horrible situation, says US President Donald Trump

వైట్‌హౌస్ ఉన్నతాధికారి మాట్లాడుతూ... దాడులపై భారతదేశంతో చర్చించామని చెప్పారు. ఉగ్రవాద నిర్మూలనలో దేశానికి పూర్తి సహకారం అందిస్తామన్నారు. ఈ దాడిపై విచారణకు పాకిస్థాన్‌ పూర్తి సహకారం అందించాలని సూచించారు. దీనికి సంబంధించి ఇప్పటికే ఆ దేశంతోనూ చర్చలు జరిపామని వెల్లడించారు.

అమెరికా స్టేట్ డిపార్టుమెంట్ డిప్యూటీ స్పోక్స్‌పర్సన్ రాబర్డ్ పల్లాడినో ఈ దాడిపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఉగ్రవాదాన్ని కట్టడి చేసేందుకు భారత్‌కు అన్ని రకాలుగా అండగా ఉంటామని చెప్పారు. అలాగే, పుల్వామా దాడి నిందితులను పాకిస్తాన్ కూడా శిక్షించాలని, ఈ మేరకు తాము అడుగుతామని చెప్పారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+