పుతిన్ సంచలనం: ఆ రెండు రీజియన్లు ఇక సర్వ స్వతంత్రం: అమెరికా చేతిలో కీలుబొమ్మగా

మాస్కో: రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్- సంచలన నిర్ణయాన్ని తీసుకున్నారు. కీలక ప్రకటన చేశారు. సుదీర్ఘకాలంగా రష్యా-ఉక్రెయిన్ మధ్య సరిహద్దుల్లో నెలకొన్న తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు, యుద్ధ వాతావరణం నెలకొన్న ప్రస్తుత పరిస్థితుల్లో ఈ ప్రకటన చేయడం ప్రాధాన్యతను సంతరించుకుంది. ఈ ఘర్షణ పూరక వాతావరణం మరింత తీవ్రతరం అయ్యే అవకాశాలు లేకపోలేదు. అమెరికా సహా జర్మనీ, ఫ్రాన్స్, అల్బేనియా, ఐర్లాండ్ వంటి పలు దేశాలు- పుతిన్ చేసిన ప్రకటనను వ్యతిరేకించాయి.

స్వతంత్రంగా

స్వతంత్రంగా

ఉక్రెయిన్‌ తూర్పు ప్రాంతంలో ఉన్న రెండు రీజియన్లు- డొనెట్స్క్, లుహాన్స్క్‌లను సర్వ స్వతంత్రంగా గుర్తించినట్లు వ్లాదిమిర్ పుతిన్ ప్రకటించారు. దీనికి సంబంధించిన ఎగ్జిక్యూటివ్ ఆర్డర్స్‌పై ఆయన సంతకం చేశారు.ఇకపై ఈ రెండు రీజియన్లకు ఉక్రెయిన్‌తో ఎలాంటి సంబంధం ఉండబోదని, రిపబ్లిక్ పీపుల్ ఆఫ్ ది స్టేట్స్‌గా వాటిని గుర్తించామని ఆయన ప్రకటించారు. ఉక్రెయిన్ ప్రభుత్వంతో గానీ.. అక్కడి పరిపాలనతో గానీ సంబంధాలు ఉండబోవని తేల్చి చెప్పారు.

రష్యా ఆక్రమిత ప్రాంతాలుగా..

రష్యా ఆక్రమిత ప్రాంతాలుగా..

డొనెట్స్క్, లుహాన్స్క్‌ రీజియన్లు- నిజానికి రష్యా ఆక్రమిత ప్రాంతాలు. ఈ రెండు ప్రాంతాల ప్రజలు ఉక్రెయిన్ నుంచి వేర్పాటును కోరుకుంటోన్నట్లుగా రష్యా చెబుతోంది. ఉక్రెయిన్‌తో కయ్యానికి కాలు దువ్వడానికి కారణాలు అయ్యాయి. ఈ రెండింటినీ తాము ఇండిపెండెంట్ స్టేట్స్‌గా గుర్తించామని రష్యా చేసిన ప్రకటన అంతర్జాతీయ స్థాయిలో ప్రకంపనలు చెలరేగడానికి కారణమైంది. ఈ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్స్‌పై సంతకం చేయడానికి ముందు- ఈ సమాచారాన్ని పుతిన్.. ఫ్రాన్స్, జర్మనీలకు తెలిపారని క్రెమ్లిన్ ఓ ప్రకటనలో పేర్కొంది.

అమెరికాపై ఘాటు విమర్శలు..

అమెరికాపై ఘాటు విమర్శలు..

ఎగ్జిక్యూటివ్ ఆర్డర్స్‌పై సంతకాలు చేసిన అనంతరం పుతిన్ మాట్లాడారు. ఉక్రెయిన్, నాటో బలగాలు, అమెరికాపై ఘాటు విమర్శలు చేశారు. అమెరికా చేతిలో ఉక్రెయిన్ ప్రభుత్వం కీలుబొమ్మలా మారిందని మండిపడ్డారు. ఉక్రెయిన్.. ఓ స్వతంత్ర దేశంలో వ్యవహరించట్లేదని, యూఎస్ కాలనీగా మారిందని విమర్శించారు. అలాంటి దేశంలో నివసించడానికి డొనెట్స్క్, లుహాన్స్క్‌ ప్రాంతాల ప్రజలు ఏ మాత్రం ఇష్టపడట్లేదని చెప్పారు.

నాటో బలగాలపైనా..

నాటో బలగాలపైనా..

ఉక్రెయిన్‌తో నాటో బలగాలు జట్టుకట్టడంపైనా పుతిన్ మండిపడ్డారు. నాటో బలగాలు ఈ నిర్ణయాన్ని తీసుకోవడం రష్యా శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు. తన సైనిక చర్యను ఉక్రెయిన్ తక్షణమే నిలిపివేయాలని పుతిన్ డిమాండ్ చేశారు. నిలిపివేయకపోతే- ఆ తరువతి పరిణామాలకు ఉక్రెయిన్ బాధ్యత వహించాల్సి ఉంటుందని అన్నారు. తమ దేశాన్ని బలహీనపర్చడానికే ఉక్రెయిన్- అలాంటి నిర్ణయాన్ని తీసుకుందని ధ్వజమెత్తారు.

అమెరికా ఆగ్రహం..

అమెరికా ఆగ్రహం..

పుతిన్ చేసిన ప్రకటనపై అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ అభ్యంతరం వ్యక్తం చేశారు. ఉక్రెయిన్ సార్వభౌమత్వానికి రష్యా భంగం కలిగించిందని వ్యాఖ్యానించారు. డొనెట్స్క్, లుహాన్స్క్ ప్రాంతాలను స్వతంత్ర రీజియన్లుగా ప్రకటించడాన్ని తాము అంగీకరించట్లేదని అన్నారు. దీన్ని తోసిపుచ్చుతున్నట్లు చెప్పారు. భద్రతమండలిని అత్యవసరంగా సమావేశపర్చాలంటూ ఆయన ఐక్యరాజ్యసమితికి విజ్ఞప్తి చేశారు. అమెరికా, మిత్రదేశాల విజ్ఞప్తి మేరకు భద్రతమండలి అత్యవసర సమావేశాన్ని ఐరాస నిర్వహించనుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+