సంచలనం: యూఎస్ ఎన్నికల్లో హ్యాకింగ్.. హిల్లరీ ఓటమి వెనుక పుతిన్ హస్తం!

అమెరికా ఎన్నికల్లో హ్యాకింగ్ జరిగిందని, ఆ హ్యాకింగ్‌కు రష్యా అధ్యక్షుడు పుతిన్ సహకరించారని యూఎస్‌ ఇంటెలిజెన్స్‌ అధికారులు విశ్వసిస్తున్నట్టుగా ఎన్‌బీసీ న్యూస్‌ రిపోర్టు వెల్లడించింది.

వాషింగ్టన్: అమెరికన్ అధ్యక్ష ఎన్నికలకు సంబంధించి పలు అనుమానాలకు తావిచ్చే విషయాలు వెల్లడవుతున్నాయి. ముఖ్యంగా అమెరికా 45వ అధ్యక్షుడు ట్రంప్, రష్యా అధ్యక్షుడు పుతిన్ నడుమ స్నేహం దిశగా అడుగులు పడుతున్న తరుణంలో.. ఇలాంటి ఆరోపణలు రావడం ప్రతీ ఒక్కరిని విస్మయానికి గురిచేస్తున్నాయి.

అమెరికా ఎన్నికల్లో హ్యాకింగ్ జరిగిందని, ఆ హ్యాకింగ్‌కు రష్యా అధ్యక్షుడు పుతిన్ సహకరించారని యూఎస్‌ ఇంటెలిజెన్స్‌ అధికారులు విశ్వసిస్తున్నట్టుగా ఎన్‌బీసీ న్యూస్‌ రిపోర్టు ఓ సంచలనాత్మక కథనాన్ని ప్రచురించింది.

యూఎస్ ఎన్నికలను ట్రంప్‌కు అనుకూలంగా మార్చేందుకు, హిల్లరీకి సంబంధించిన ఎన్నికల సమాచారంతో పాటు,పలువురు అమెరికన్ వ్యక్తులు, సంస్థల సమాచారాన్ని పుతిన్ హ్యాక్ చేయించినట్టుగా సీఐఏ విచారణలో తేలిందని ఎన్‌బీసీ న్యూస్‌ రిపోర్టు వెల్లడించింది.

Putin Personally Involved in U.S. Election Hack

ప్రతీకారం తీర్చుకోవడానికే!:

2011లో ర‌ష్యాలో జ‌రిగిన ఎన్నిక‌ల ఫలితాల‌పై అనుమానాలు లేవనెత్తుతూ.. ఆ సమయంలో అమెరికా విదేశాంగ శాఖ మంత్రిగా ఉన్న హిల్లరీ ప్రశ్నించింది. దీంతో అక్కడి వీధుల్లో పుతిన్‌కు వ్యతిరేకంగా ఆందోళనలు జరిగాయి. అప్పటినుంచి హిల్లరీపై కక్ష పెంచుకున్న పుతిన్ యూఎస్ ఎన్నికలను హ్యాక్ చేయించి అందుకు ప్రతీకారం తీర్చుకున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.

Putin Personally Involved in U.S. Election Hack

పుతిన్‌పై ఆరోపణలను ఖండించిన ట్రంప్:

యూఎస్ ఎన్నికల్లో హ్యాకింగ్.. దాని వెనుక పుతిన్ హస్తం ఉన్నట్టుగా వస్తున్న ఆరోపణలను ట్రంప్ ఖండించారు. అమెరికా ఎన్నిక‌ల హ్యాకింగ్‌లో ర‌ష్యా ఉంద‌న్న ఆరోప‌ణ‌లు హాస్యాస్ప‌దంగా ఉన్నాయ‌ని ట్రంప్ అన్నారు.

Putin Personally Involved in U.S. Election Hack

విచారణ జరిపిస్తారా?:

హ్యాకింగ్ వ్యవహారంపై విచారణ జరిపించి తీరాల్సిందేనని అమెరికన్ సీనియర్ చట్టప్రతినిధులు డిమాండ్ చేస్తున్నారు. దీంతో ఎన్నికల సమయంలో జరిగిన సైబర్ దాడులకు సంబంధించి సమగ్ర నివేదికను జనవరి 20వ తేదీ లోపు తనకు అందజేయాల్సిందిగా అధ్యక్షుడు బరాక్ ఒబామా అధికారులను ఆదేశించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+