పుతిన్- ట్రంప్ మధ్య గంటపాటు ఫోన్ కాల్.. ఉక్రెయిన్- రష్యా యుద్ధానికి ఎండ్ కార్డ్..!

రష్యా - ఉక్రెయిన్ మధ్య నాలుగేళ్లకుపైగా సాగుతున్న యుద్ధాన్ని నిలిపివేసేందుకు అమెరికా సన్నద్ధం అయిన సంగతి తెలిసిందే. ఈ మేరకు ఇటీవల అమెరికా దౌత్య వేత్తలు స్టీవ్ విట్ కాఫ్, జార్డ్ కుష్నర్ రష్యా యంత్రాంగంతో చర్చలు జరిపారు. అయితే తాజాగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్- రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఫోన్ లో గంటపాటు సంభాషించారు. సెప్టెంబర్ 8 మంగళవారం రోజున ఇరు దేశాధినేతల మధ్య ఫోన్ సంభాషణ జరిగింది. ఉక్రెయిన్ యుద్ధంపై శాంచి చర్చలు, అలాగే అమెరికా దౌత్య వేత్తలతో జరిపిన చర్చలపై ఇరు దేశాల అధినేతలు మాట్లాడుకున్నారు. ఉక్రెయిన్ తో యుద్ధాన్ని వీలైనంత త్వరగా ముగించాలని పుతిన్ కు ట్రంప్ సూచించినట్లు తెలుస్తోంది. తద్వారా రష్యా- అమెరికా ఎకనామిక్ అండ్ ట్రేడ్ సంబంధాలు మరింత బలోపేతం అవుతాయని పేర్కొన్నారు.

అయితే ట్రంప్ చేసిన ప్రతిపాదనకు రష్యా అధ్యక్షుడు పుతిన్ కూడా అంగీకరించినట్లు తెలుస్తోంది. ఇక ఉక్రెయిన్ తో శాంతి చర్చలతోపాటు ఇరు దేశాల మధ్య ఖైదీల మార్పిడి ప్రక్రియను కూడా యథాతథంగా కొనసాగించాలని అంగీకారానికి వచ్చినట్లు తెలుస్తోంది. మరోవైపు ట్రంప్ శాంతి ప్రయత్నాలను తాము ఎంతగానో గౌరవిస్తున్నట్లు ఇటీవల రష్యా అధికార ప్రతినిధి దిమిత్రి పెస్కోవ్ ఇటీవల స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే అమెరికా నుంచి స్టీవ్ విట్ కాఫ్, జార్డ్ కుష్నర్ లు సెప్టెంబర్ 5 న రష్యా చేరుకుని పుతిన్ తో సమావేశం అయ్యారు. ఆ తర్వాత సెప్టెంబర్ 6 న ఉక్రెయిన్ రాజధాని కీవ్ కు చేరుకుని ఆ దేశ అధ్యక్షుడు జెలెన్ స్కీతో సంప్రదింపులు జరిపారు.

Putin Trump news Hour-long phone conversation between Putin and Trump on Russia-Ukraine peace

మరోవైపు పుతిన్- ట్రంప్ సంభాషణను రష్యా విదేశాంగ శాఖ అడ్వైజర్ యూరీ ఉషాకోవ్ కీలకమైనవిగా అభివర్ణించారు. ఇరు దేశాధినేతల మధ్య సంభాషణ కన్ స్ట్రక్టీవ్ అండ్ ఫ్రాంక్ గా జరిగిందని అన్నారు. వీలైనంత త్వరగా ఇరు దేశాల మధ్య యుద్ధం ఆగిపోవాలని ట్రంప్ స్పష్టం చేసినట్లు యూరీ ఉషాకోవ్ పేర్కొన్నారు. ఇదే అంశంపై ట్రంప్ కు పుతిన్ బ్యాటిల్ ఫీల్డ్ లో ప్రస్తుత పరిస్థితులపై చర్చించారు. ఉక్రెయిన్ తో యుద్ధం ముగిస్తే.. వాషింగ్టన్- మాస్కో మధ్య వాణిజ్య సంబంధాలు మరింత బలోపేతం అవుతాయని ట్రంప్ స్పష్టం చేసినట్లు యూరీ ఉషాకోవ్ తెలిపారు. ట్రంప్- పుతిన్ సంభాషణల నేపథ్యంలో రష్యా- ఉక్రెయిన్ మధ్య యుద్ధానికి ఫుల్ స్టాప్ పడే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+