గ్రామ పంచాయతీలకు సొంత ఖాతాలు.. స్వయం ఆర్ధిక ప్రతిపత్తితో ఆ విధానానికి స్వస్తి

గ్రామ పంచాయతీలకు ఆర్థిక స్వయంప్రతిపత్తి కల్పించే దిశగా తెలంగాణ ప్రభుత్వం మరో కీలక అడుగు వేసింది. ఇకపై పంచాయతీలు తమ సొంత ఆదాయాలను, కేంద్ర, రాష్ట్ర పథకాల ద్వారా వచ్చే నిధులను ట్రెజరీలో జమ చేయాల్సిన అవసరం లేదు. నేరుగా సమీపంలోని జాతీయ బ్యాంకులు, సహకార బ్యాంకులు లేదా పోస్టాఫీసు ఖాతాల్లో జమ చేసుకోవచ్చు.ఈ మేరకు పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ శుక్రవారం జీవో నం.43ను జారీ చేసింది.

తెలంగాణ పంచాయతీరాజ్ (నాలుగో సవరణ) చట్టం-2026ను అక్టోబర్ 9 నుంచే అమల్లోకి తెస్తూ ఈ ఉత్తర్వులు ఇచ్చింది. గత శాసనసభ సమావేశాల్లో చట్ట సవరణ జరిగిన తర్వాత అధికారిక అమలు ఉత్తర్వులు ఇప్పుడు వెలువడ్డాయి.ఇంతవరకు ఉమ్మడి రాష్ట్రం నుంచి తెలంగాణలోనూ పంచాయతీల నిధులు ట్రెజరీల ద్వారానే విడుదలయ్యేవి. దీనివల్ల చిన్నపాటి పనులకు కూడా ప్రభుత్వ అనుమతి కావాల్సి వచ్చేది.

Gram Panchayats Own Bank Accounts - Direct Deposit of Revenue in gram pnchayat accounts Ends Treasury Delays

సిబ్బంది జీతభత్యాలు, వీధి లైట్లు మార్చడం, తాగునీటి సమస్యలు, పారిశుద్ధ్యం, రహదారుల మరమ్మతులు వంటి అత్యవసర పనులకు నిధులు సకాలంలో అందక పంచాయతీలు తీవ్ర ఇబ్బందులు పడేవి. బిల్లులు ఆలస్యం కావడంతో అభివృద్ధి పనులు నిలిచిపోయేవి.కొత్త విధానం వల్ల ఈ ఇబ్బందులకు తెరపడనుంది. పంచాయతీలు తమకు వచ్చే పన్నులు, ఇతర స్థానిక ఆదాయం, కేంద్ర, రాష్ట్ర పథకాల నిధులన్నింటినీ వెంటనే సమీప బ్యాంకు లేదా పోస్టాఫీసు ఖాతాల్లో జమ చేయాలని ప్రభుత్వం నిర్దేశించింది.

దీనితో గ్రామస్థాయిలో అవసరాలకు అనుగుణంగా నిధులను వేగంగా వినియోగించుకునే అవకాశం ఏర్పడుతుంది.పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క ఈ నిర్ణయాన్ని స్వాగతించారు. పల్లెల ఆర్థిక స్వావలంబనకు ఇది కీలక ముందడుగు అని ఆమె అన్నారు. గ్రామ పంచాయతీలు కేవలం ప్రభుత్వ పథకాలను అమలు చేసే ఏజెన్సీలుగా మిగిలిపోకూడదని, స్వీయ పరిపాలన సాగించే అధికారిక సంస్థలుగా ఎదగాలనే ఉద్దేశంతోనే ఈ మార్పు తీసుకువచ్చామని స్పష్టం చేశారు.

గ్రామసభ తీర్మానం ద్వారా నిధులను వినియోగించుకునే వెసులుబాటు కూడా ఉంటుంది. దీనివల్ల పారదర్శకత పెరుగుతుంది. స్థానిక అవసరాలకు ప్రాధాన్యం ఇచ్చి పనులు చేపట్టే అవకాశం పంచాయతీలకు లభిస్తుంది. జీతభత్యాలు సకాలంలో చెల్లించడం, అత్యవసర పనులు వేగంగా పూర్తి చేయడం సాధ్యమవుతుంది.ఇప్పటికే మున్సిపాలిటీలకు ఇలాంటి వెసులుబాటు ఉంది. అదే తరహాలో గ్రామ పంచాయతీలకు కూడా ఆర్థిక స్వేచ్ఛ కల్పించడం ద్వారా గ్రామీణ ప్రాంతాల అభివృద్ధి వేగవంతం కానుందని అధికార వర్గాలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నాయి.

తెలంగాణ మహిళలకు పండుగవేళ శుభవార్త .. ఉచిత చీరల పంపిణీకి ముహూర్తం ఫిక్స్!
తెలంగాణ మహిళలకు పండుగవేళ శుభవార్త .. ఉచిత చీరల పంపిణీకి ముహూర్తం ఫిక్స్!

క్షేత్రస్థాయిలో ఈ విధానాన్ని వెంటనే అమలు చేయాలని పంచాయతీరాజ్ కమిషనర్ అధికారులను ఆదేశించినట్లు సమాచారం.పల్లెల్లో తాగునీరు, పారిశుద్ధ్యం, వీధి లైట్లు, రోడ్లు వంటి ప్రాథమిక సేవలు మెరుగుపడే అవకాశం ఉంది. గ్రామ పంచాయతీలు తమ సొంత వనరులపై ఎక్కువ నియంత్రణ సాధించడంతో స్థానిక సమస్యల పరిష్కారం సులభతరం కానుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+