Putin: లొంగిపోతే బతికి ఉంటారు.. ఉక్రెయిన్ సైనికులకు పుతిన్ హెచ్చరిక
Russia President Vladimir Putin: ఉక్రెయిన్‌తో యుద్ధంలో కాల్పుల విరమణ ఒప్పందం కోసం చర్చలు జరుగుతున్న వేళ రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కుర్క్స్ ప్రాంతంలో పోరాడుతున్న ఉక్రెయిన్ సైనికులు లొంగిపోవాలని పుతిన్ శుక్రవారం పిలుపునిచ్చారు. ఉక్రెయిన్ సైనికులు లొంగిపోతే వారు బతికి ఉంటారని రష్యా అధ్యక్షుడు అన్నారు. అంతకు ముందు పుతిన్‌తో సంభాషణ సందర్భంగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఉక్రెయిన్ సైనికులపై కనికరం చూపాలని పుతిన్ కు విజ్ఞప్తి చేశారు. కుర్క్స్ లో ఉక్రెయిన్ దళాలను రష్యా దళాలు చుట్టుముట్టాయని ట్రంప్, పుతిన్ ఇద్దరూ చెప్పారు. ఈ క్రమంలో తన సైన్యంపై ఒత్తిడి పెరుగుతోందని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ అంగీకరించారు.
మానవతా అంశాలను పరిగణనలోకి తీసుకోవాలన్న అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సూచన మేరకు ఓ విషయాన్ని పుతిన్ స్పష్టంగా చెప్పారు. ఉక్రేనియన్లు లొంగిపోయి ఆయుధాలు వదిలేస్తే వారి ప్రాణాలకు గ్యారెంటీ ఇవ్వబడుతుందని రష్యా అధ్యక్షుడు అన్నారు. అమెరికా అధ్యక్షుడి పిలుపును సమర్థవంతంగా అమలు చేయడానికి, ఉక్రెయిన్ సైనిక-రాజకీయ నాయకత్వం తమ దళాలను ఆయుధాలను విడిచిపెట్టి లొంగిపోవాలని ఆదేశించాలని పుతిన్ అన్నారు.

ఒత్తిడిలో ఉక్రెయిన్ సైన్యం
రష్యా గత వారం రోజులుగా కుర్క్స్ లో తన కార్యకలాపాలను ముమ్మరం చేసింది. పశ్చిమ సరిహద్దు ప్రాంతంలో ఉక్రెయిన్ నుంచి స్వాధీనం చేసుకున్న పెద్ద భూభాగాన్ని తిరిగి స్వాధీనం చేసుకుంది. గత ఏడాది ఆగస్టులో ఉక్రేనియన్ సైన్యం ఆకస్మిక దాడి చేసి కుర్క్స్‌లోని ఒక పెద్ద ప్రాంతాన్ని స్వాధీనం చేసుకుంది. సుదీర్ఘ యుద్ధం తర్వాత కూడా రష్యన్ సైన్యం మొత్తం ప్రాంతాన్ని తిరిగి స్వాధీనం చేసుకోలేకపోయింది. అయితే గత నెల చివర్లో వైట్ హౌస్ లో జరిగిన వివాదం తర్వాత ట్రంప్ అమెరికా సైనిక సహాయాన్ని నిలిపివేశారు. ఈ నేపథ్యంలో ఉక్రెయిన్ సైన్యం ఒత్తిడిలో పడింది.
ఉక్రెయిన్ దళాలను చుట్టుముట్టిన రష్యా
శుక్రవారం తెల్లవారుజామున డొనాల్డ్ ట్రంప్ తన ట్రూత్ సోషల్ ప్లాట్‌ఫామ్‌లో ఒక పోస్ట్ చేశారు. ఆ పోస్ట్ లో వేలాది మంది ఉక్రేనియన్ సైనికులను రష్యా సైన్యం చుట్టుముట్టిందని వెల్లడించారు. ఈ క్రమంలో మానవతా అంశాలను పరిగణనలోకి తీసుకుని వారిని ప్రాణాలతో వదిలివేయాలని పుతిన్ కు విజ్ఞప్తి చేశారు. పుతిన్‌తో ఫోన్‌లో మాట్లాడిన ట్రంప్.. వారి ప్రాణాలను కాపాడాలని కోరినట్లు తెలిసింది. వారిపై దాడి చేస్తే ఇది రెండో ప్రపంచ యుద్ధం తర్వాత ఇంతవరకు చూడని భయంకరమైన మారణహోమం అవుతుంది. కుర్క్స్ ప్రాంతంలో ఉక్రెయిన్ బలగాలు పౌరులపై నేరాలకు పాల్పడుతున్నాయని రష్యా అధ్యక్షుడు పుతిన్ ఆరోపించారు. దీనిని ఉక్రెయిన్ తీవ్రంగా ఖండించింది. కుర్క్స్ ప్రాంతంలో తమ సైన్యం పరిస్థితి చాలా కష్టంగా ఉందని జెలెన్స్కీ మీడియాతో అన్నారు.
-
ఇరాన్ కు ట్రంప్ డెడ్ లైన్- కౌంట్ డౌన్ బిగిన్స్ -
పాతాళానికి బంగారం ధరలు- రంజాన్ పండగ వేళ -
తమిళనాడులో ఆ పార్టీదే అధికారం: విజయ్ రాకతో మారిన ఈక్వేషన్లు -
పల్నాడు, సింహాద్రి ప్రయాణీకులకు రైల్వే గుడ్ న్యూస్, ఇక నుంచి..!! -
3000 ఏళ్ల సంప్రదాయం.. యుద్ధం మధ్యే నూతన సంవత్సరం -
విడాకులపై మెగా డాటర్ "నిహారిక" కామెంట్స్.. అసలు కాంటాక్ట్ కూడా లేదు ?? -
40 ఏళ్లలో లేని అతిపెద్ద పసిడి పతనం. 1983 సీన్ రిపీట్! -
ఏప్రిల్ నెలలో సింహరాశి, కన్యారాశి జాతక ఫలం -
'దురంధర్ 2' ఓ చెత్త సినిమా: స్టార్ హీరోయిన్ -
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
కొత్త పెన్షన్లు, మహిళలకు కొత్త వరాలు - రైతు భరోసా ఇక నుంచి..!! -
మనసు మార్చుకున్న బాలినేని, నెక్స్ట్ ఇక...!?












Click it and Unblock the Notifications