Third World War: మూడో ప్రపంచ యుద్ధానికి పుతిన్ ప్లాన్.. రష్యా సన్నాహాలను బయటిపెట్టిన నిఘా రిపోర్ట్!

Third World War: ప్రపంచం మరోసారి ప్రపంచ యుద్ధం అంచున నిలిచింది. గత రెండు ప్రపంచ యుద్ధాల మాదిరిగానే మూడో ప్రపంచ యుద్ధం కూడా యూరప్ లోనే ప్రారంభం కానున్నట్లు తెలిసింది. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఐదేళ్లలోపు యూరప్ లో ఒక పెద్ద యుద్ధాన్ని ప్రారంభించడానికి సన్నాహాలు చేస్తున్నారని నిఘా వర్గాలు తెలిపాయి. డానిష్ నిఘా సంస్థ రష్యా సైనికి సామర్థ్యాలను అంచనా వేసిందని బ్రిటీష్ మీడియా సంస్థ ది సన్ నివేదించింది. నాటోపై పూర్తి స్థాయి దాడిని ప్రారంభించే ముందు పొరుగు దేశాలపై యుద్ధం చేయడానికి పుతిన్ సిద్ధంగా ఉండవచ్చని ఆ నివేదిక పేర్కొంది.

రష్యా, ఉక్రెయిన్ మధ్య శాంతి ఒప్పందం
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చొరవ తర్వాత రష్యా, ఉక్రెయిన్ మధ్య శాంతి ఒప్పందం కుదిరే అవకాశం ఉందని భావిస్తున్న తరుణంలో ఈ నిఘా నివేదిక రావడం గమనార్హం. ఈ శాంతి ఒప్పందం పుతిన్ కు విజయంగా మారుతుందని విశ్లేషకులు భయపడుతున్నారు. డొనాల్డ్ ట్రంప్ పదే పదే యూరప్ భద్రతను అమెరికాకు భారంగా చిత్రీకరించి.. పుతిన్ నాటో అంతర్గత చీలికను సద్వినియోగం చేసుకునేలా చేశారు.

Putin s plan for Third World War Intelligence report reveals Russia s preparations

నాటోకు వ్యతిరేకంగా సిద్ధమవుతోన్న రష్యా
డెన్మార్క్ డిఫెన్స్ ఇంటెలిజెన్స్ సర్వీస్ చేసిన రహస్య అంచనా ప్రకారం.. రష్యా పశ్చిమ దేశాలతో వివాదంలో ఉందని, నాటోకి వ్యతిరేకంగా యుద్ధానికి సిద్ధమవుతోందని పేర్కొంది. అటువంటి యుద్ధం ప్రారంభించాలనే దానిపై ఎటువంటి నిర్ణయం తీసుకోనప్పటికీ.. అవసరమైతే అలా యుద్దం చేయగల సామర్థ్యాన్ని రష్యా పెంచుకుంటోంది.

సామర్థ్యాన్ని పెంచుకున్న రష్యా
నాటోను సైనికపరంగా, రాజకీయంగా బలహీనపరచాలని పుతిన్ భావిస్తే ముప్పు మరింత ఎక్కువగా ఉంటుందని నిఘా నివేదిక అంచనా వేసింది. పుతిన్ తన సాయుధ దళాల పునర్నిర్మాణం, సంస్కరణలను పెద్ద ఎత్తున ప్రారంభించారని డానిష్ నిఘా సంస్థ హెచ్చరించింది. రష్యా ఇప్పటికే ఆయుధాల ఆధునీకరణ, సైనిక ఉత్పత్తిలో గణనీయమైన పెరుగుదల ద్వారా తన సైనిక సామర్థ్యాన్ని పెంచుకుందని పేర్కొంది.

ఆరు నెలల్లో యుద్ధం ప్రారంభం కావచ్చు..
ఉక్రెయిన్ లో యుద్ధం ఆగిపోతే లేదా ముగిస్తే.. రష్యా అధ్యక్షుడు నాటోను లక్ష్యంగా చేసుకుంటారని నిఘా నివేదిక హెచ్చరించింది. అటువంటి పరిస్థితిలో పుతిన్ ఆరు నెలల్లో పొరుగు దేశంతో యుద్ధం చేయవచ్చు. గతంలో సోవియట్ యూనియన్ లో భాగంగా ఉన్న జార్జియా, మోల్డోవా దేశాలు ఇప్పటికీ ప్రమాదంలో ఉన్నాయి. రెండేళ్లలో రష్యా ఒకటి లేదా అంతకంటే ఎక్కువ బాల్టిక్ రాష్ట్రాలు, నాటో దేశాలకు ముప్పును కలిగిస్తుందని నివేదిక పేర్కొంది. అమెరికా జోక్యం చేసుకోకపోతే 5ఏళ్ల లోపులోనే యూరప్ లో ప్రపంచ యుద్ధం జరిగే ప్రమాదం ఉందని పేర్కొంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+