ప్రపంచంలోనే అత్యంత సురక్షితమైన ఎయిర్‌లైన్స్‌గా కాంటాస్
న్యూఢిల్లీ: ఆస్టేలియాకు చెందిన కాంటాస్ ఎయిర్‌లైన్స్ ప్రపంచంలోనే అత్యంత సురక్షితమైన ఎయిర్ లైన్స్‌గా నిలిచింది. ఎయిర్ లైన్ రేటింగ్స్.కామ్ వెబ్‌సైట్ ఓ జాబితాను విడుదల చేసింది. విమాన సర్వీసులు, అకౌంట్ల నిర్వహణ, ప్రమాదాల రికార్డు మొదలైన అంశాలను పరిగణనలోనికి తీసుకుని ఈ జాబితాను రూపొందించారు.
పాఠకుల కోసం ఫేస్‌బుక్ ద్వారా ఎప్పటికప్పుడు తాజా వార్తలు... లైక్ చేయండి.

ఈ జాబితాలో మొత్తం 449 ఎయిర్ లైన్స్ సంస్ధలు పాల్గొనగా... కాంటాస్‌కే మొదటి స్ధానం దక్కింది. దీంతో ఎయిర్ లైన్ రేటింగ్.కామ్ వెబ్‌సైట్ కాంటాస్‌పై ప్రశంసలను కురిపించింది. గత 60 సంవత్సరాలుగా కాంటాస్ ఎయిర్‌లైన్స్ ప్రయాణీకులకు తన సేవలను అందిస్తుందని పేర్కొంది.
ఈ సందర్భంలో స్ట్రాటజిక్ ఎయిర్‌వేస్ సొల్యూషన్స్ ఛైర్మన్ హాన్స్ ఫోర్డ్ మాట్లాడుతూ కాంటాస్ శాటిలైట్ వ్యవస్ధ సాయంతో తన విమానాల ఇంజన్ల పనితీరును పర్యవేక్షిస్తుందని అన్నారు. కాంటాస్ విమానాలను నడిపే పైలెట్లు ప్రపంచంలో మిగతా విమాననాల పైలెట్లు కంటే కూడా ఎక్కువ జీతం తీసుకుంటారని పేర్కొన్నారు.
ఎయిర్ లైన్ రేటింగ్స్.కామ్ వెబ్‌సైట్ ప్రకటించిన జాబితాలో కాంటాస్ తర్వాతి స్ధానాల్లో ఎయిర్ న్యూజిలాండ్, బ్రిటిష్ ఎయిర్‌వేస్, క్యాథే ఫసిఫిక్, ఎమిరేట్స్, ఎతిహాద్ ఎయిర్‌వేస్, ఇవా ఎయిర్, సింగపూర్ ఎయిర్‌లైన్స్ ఉన్నాయి.












Click it and Unblock the Notifications