Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

నన్నే ఆట పట్టిస్తావా?: ఇరక్కుమ్మేసిన ఎద్దు(వీడియో)

స్పెయిన్‌: ఓ ఎద్దును ఆటపట్టించేందుకు ప్రయత్నించిన ఓ ఆకతాయికి తగిన శాస్తి జరిగిందనిపిస్తుంది ఈ వీడియో చూస్తే. 'కేజ్ ర్యాగింగ్' పేరుతో స్పెయిన్‌లో జరిగే ఈ క్రీడ అతని ప్రాణం మీదికి తెచ్చింది.

ఈ ఆటలో భాగంగా ఓ వ్యక్తిని ఇనుప పంజరం(కేజ్)లో ఉండి బయట ఓ ఎద్దును ఉంచుతారు. ఆ ఇనుప పంజరంలోని వ్యక్తి ఆ ఎద్దును ర్యాగింగ్‌ చేస్తాడు. ఆ ఎద్దు రెచ్చిపోయినా.. ఇనుప పంజరంలో ఉన్న వ్యక్తిని ఏమీ చేయలేదు. ఇదీ గేమ్‌.

అయితే ఈ ఘటనలో ఆ వ్యక్తి చేసిన ర్యాగింగ్‌ను తట్టుకోలేకపోయిన ఎద్దు ఇనుప పంజరాన్ని సైతం బద్దలుగొట్టేసింది. ఓ ఇనుప ఊచను వంచేసి పంజరంలోకి ప్రవేశించింది. దాంతో ఆ యువకుడు బిక్కచచ్చిపోయాడు. తప్పించుకునేందుకు విఫలయత్నం చేశాడు.

ఈ లోపలే అతణ్ని చేరుకున్న ఎద్దు తన వాడి కొమ్ములతో కుమ్మేసింది. దొర్లించి.. దొర్లించి పొడిచేసింది. అయితే అదృష్టవశాత్తూ పక్కనే ఉన్న వ్యక్తులు అతణ్ని కాపాడారు. అప్పటికే తీవ్ర గాయాలపాలైన ఆ వ్యక్తిని ఆస్పత్రికి తరలించారు.

కాగా, అతను ఎరుపు రంగు టీ షర్ట్ వేసుకోవడం కూడా ఎద్దును ఆగ్రహానికి గురిచేసి ఉంటుందని భావిస్తున్నారు. అయితే, ఈ వీడియో ఇప్పుడు సోషల్‌ మీడియాలో హల్‌చల్‌ చేస్తోంది. ఇది ఇలా ఉండగా, స్పెయిన్‌లో జరుగుతున్న ఈ క్రీడను రద్దు చేయాలంటూ ఇప్పటికే ఎన్నో నిరసనలు వ్యక్తమయ్యాయి.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+