ఇంగ్లాండులో కామక్రీడలు: ఢిల్లీలో రేపిస్టు అరెస్టు
బెంగళూరు: విదేశాలలో వరసగా లైంగిక దాడులు చేసి చాకచక్యంగా తప్పించుకుని భారత్ వచ్చిన కామాంధుడిని పోలీసులు అరెస్టు చేశారు. భారత దేశానికి చెందిన రామీందర్ సింగ్ (28) అనే వ్యక్తిని ఢిల్లీలో క్రైం బ్రాంచ్ పోలీసులు అరెస్టు చేశారు.
ఇంగ్లాండులో ఇతని మీద అత్యాచారం, అత్యాచారయత్నం, హత్యాయత్నం కేసులు నమోదు అయ్యాయని ఢిల్లీ సిటి పోలీస్ కమిషనర్ అశోక్ చంద్ చెప్పారు. ఇతను చదువుకొవడానికి ఇంగ్లాండ్ వెళ్లాడు. తరువాత అక్కడ ఇతను కామంతో కళ్లు మూసుకుపోయి యువతులు, మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్థించాడు.
స్కాంట్ ల్యాండ్ లోని హాస్టల్ లో రామీందర్ సింగ్ నివాసం ఉండేవాడు. 2012 జులై 22వ తేదిన అదే హాస్టల్ లో నివాసం ఉంటున్నయువతి (23)ని నిర్జనప్రదేశంలోకి తీసుకు వెళ్లాడు. తరువాత ఆమె మీద అత్యాచారం చేశాడు. ఆ సమయంలో ఆమె ఎదురు తిరగడంతో ముఖం పగలగొట్టి హత్య చెయ్యడానికి ప్రయత్నించాడు.

అదే విధంగా అంతకు ముందు పబ్ లో ఒక యువతి (27) ఇతనికి పరిచయం అయ్యింది. ఆమెను నిర్జనప్రదేశంలోకి తీసుకు వెళ్లి అత్యాచారం చేశాడు. బాధితులు ఇద్దరు పోలీసులకు ఫిర్యాదు చేశారు. స్కాట్ ల్యాండ్ పోలీసులు ఇతని కోసం గాలించారు.
విషయం పసిగట్టిన రామీందర్ సింగ్ 2012 జులై నెలలోనే చాకచక్యంగా తప్పించుకుని భారత్ వచ్చేశాడు. తరువాత నకిలి దృవీకరణ పత్రాలు స్పృష్టించి చండిఘడ్ లో తలదాచుకున్నాడు.ఇంగ్లాడ్ పోలీసులు రామీందర్ సింగ్ కోసం గాలించినా ఫలితం లేకపోయింది.
చివరికి ఇంగ్లాండ్ ప్రభుత్వం ఇంటర్ పోల్ ద్వారా రెడ్ కార్నర్ నోటీసులు జారి చేసింది. విషయం తెలుసుకున్న ఢిల్లీ క్రైం బ్రాంచ్ పోలీసులు రామీందర్ సింగ్ ను అరెస్టు చేశారు. ఇంగ్లాండ్ పోలీసులకు సమాచారం అందించామని ఢిల్లీ నగర క్రైం బ్రాంచ్ విభాగం జాయింట్ పోలీస్ కమిషనర్ రవీంద్ర యాదవ్ తెలిపారు.












Click it and Unblock the Notifications