కోట్లు పలికిన నాణెం.. దీని ప్రత్యేకతలు ఇవే.. ఎక్కడ అంటే..?
పాత నోట్లు లేదంటే కాయిన్స్‌కు విలువ ఎక్కువే. చాలా సందర్భాల్లో మన దేశంలో ఫలానా ఏడాది నాణెం కావాలనే/ నోటు కావాలనే ప్రకటన కూడా చూశాం. కానీ అదీ ఇప్పుడు ఇంగ్లాండ్‌లో భారీగా వెచ్చించి కొనుగోలు చేశారు. ఓ కాయిన్ విలువ మన సంపదలో రూ.2.6 కోట్లు పలికింది. ఇదీ నిజం.. సో నాణెం ఎంత విలువ అయిందో దీనిని బట్టి అర్థం చేసుకోవచ్చు. సరదగా ఉంచిన నాణెం.. సిరి సంపదలను తెచ్చిపెట్టింది.

ఏళ్ల నాటి నాణెం..
వందల ఏళ్ల నాటి నాణెలకు డిమాండ్ ఎక్కువగా ఉంటుంది. వందల ఏళ్ల క్రితం తయారు చేసిన ఓ అరుదైన నాణేన్ని వేలం వేయగా ఏకంగా కోట్ల ధర పలికింది. షిల్లింగ్ కరెన్సీకి చెందిన సిల్వర్ కాయిన్ ఇదీ.. ఈ నాణాన్ని న్యూ ఇంగ్లండ్‌లోని మింట్‌లో 1652లో తయారు చేశారు. ఆ నాణేనికి ఒక వైపు NE అనే అక్షరాలు ఉంటాయి. NE అంటే న్యూ ఇంగ్లండ్ అని అర్థం. మరోవైపు రోమన్ న్యుమరల్ XII అని ఉంటుంది. షిల్లింగ్ కరెన్సీలో XII అంటే 12 పెన్నీలు అని అర్థం. ఈ అరుదైనా నానాన్ని గత శుక్రవారం వేలంలో వేశారు. అమెరికాకు చెందిన ఆన్‌లైన్ బిడ్డర్ 3,50,000 డాలర్లను కొనుగోలు చేశారు. మన భారత కరెన్సీలో రూ.2.6 కోట్లు పలికింది.

ఇదీ స్పెషాలిటీ
ఈ నాణానికి చాలా ప్రత్యేకతలు ఉన్నాయి. న్యూ ఇంగ్లండ్‌లో ముద్రించిన మొదటి కాయిన్ అది అని తెలుస్తోంది. 1652కు ముందు న్యూ ఇంగ్లండ్‌లో నెదర్లాండ్స్, స్పానిస సంస్థానం, ఇంగ్లండ్‌కు సంబంధించిన కాయిన్స్‌నే అధికారికంగా ఉపయోగించేవారు. సో అలా దాని ప్రత్యేకత రీత్యా మంచి రేటు వచ్చింది. 1652లో తొలిసారి న్యూఇంగ్లండ్ సొంత కాయిన్స్‌ను ముద్రించడం ప్రారంభించింది. అలా ముద్రించిన నాణెం వెలం వేశారు. ఈ నాణెం అంచనాలకు మించి అమ్ముడు పోయిందని కాయిన్ స్పెషలిస్ట్ జేమ్స్ మోర్టన్ తెలిపారు.

మీకు కాకున్నా..
నాణెం కదా అని తక్కువ అంచనా వేయకండి. ఎందుకంటే అదే మీకు అష్టైశ్వర్యాలు కురిపించగలదు. మిమ్మల్ని ఒక్కసారిగా కోటీశ్వరులను చేయగలదు. నాణెం ఉన్న విలువను తెలుసుకొని.. మీరు కాకున్నా.. మనమలు, మునిమనుమలకు ఇస్తే వారిని ధనవంతులను చేసినవారు అవుతారు. సో మీ వద్ద ఉన్న కాయిన్స్ అలానే ఉంచండి. భవిష్యత్ తరాలకు మంచి గిప్ట్ ఇవ్వండి.. వేలం వేసే సమయంలో ఏ నాణెం అడుగుతారో తెలియదు కదా.. అందుకే కాయిన్స్ కలెక్షన్ హబీ మంచిదనే దీంతో మరోసారి రుజువు అయ్యింది.












Click it and Unblock the Notifications