ఇంటర్నెట్లో హల్ చల్ చేస్తున్న ఒబామా కుమార్తె ఫోటో
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా పెద్ద కుమార్తె మలియా ఒబామా (16) ఫొటో ఇంటర్నెట్‌లో హల్ చల్ చేస్తోంది. బ్రూక్లిన్ ర్యాప్ టీ షర్టు ధరించిన మలియా పోని టెయిల్ హెయిర్‌తో నేరుగా ఫోజిచ్చినట్లు కనిపిస్తోంది.

పాఠకుల కోసం ఫేస్‌బుక్ ద్వారా ఎప్పటికప్పుడు తాజా వార్తలు... లైక్ చేయండి.
ఈ ఫొటో ఎవరు తీశారు ? ఇంటర్నెట్ లోకి ఎలా వచ్చిందో? అనే విషయంపై స్పష్టత రాలేదు. సాధారణంగా ఇలాంటి వివాదాలపై వెంటనే స్పందించే అమెరిక అధ్యక్ష భవనం వైట్ హౌస్ కూడా ఈ ఫొటోపై ఇప్పటి వరకు స్పందించక పోవడం విశేషం.
ఇక బరాక్ ఒబామాకు ఇద్దరు కుమార్తెలు. పెద్దమ్మాయి మలియా ఒబామా 16 కాగా, చిన్నమ్మాయి షాషాకి 14 సంవత్సరాలు. గతంలో బరాక్ ఒబామా కూతుళ్లను కిడ్నాప్ చేసేందుకు ప్రయత్నాలు జరిగినట్లు వార్తలు వచ్చిన విషయం తెలిసిందే.
ఒబామా కూతుళ్లు ప్రయాణిస్తున్న కారును అనుమాతుడు వైట్‌హౌజ్ వరకూ వెంబడించాడని తెలిపారు. ట్రెజరీ డిపార్ట్‌మెంట్ సమీపంలోకి రాగానే ఆ వాహనాన్ని ఆపివేసినట్లు చెప్పారు. అనంతరం ఆ వాహనాన్ని నడుపుతున్న వ్యక్తి అనుమానాస్పదంగా ఉండటంతో అతన్ని అదుపులోకి తీసుకున్నారు.












Click it and Unblock the Notifications