చైనా నేతృత్వంలో 15 ఆసియా దేశాల స్వేచ్ఛా వాణిజ్య కూటమి ఒప్పందం
హనోయ్: చైనా మద్దతుతో అగ్రరాజ్యం అమెరికా లేని ఆసియా పసిఫిక్ ఆర్థిక వ్యవస్థలోని 15 దేశాలు స్వేచ్ఛా వాణిజ్య కూటమిగా ఏర్పాటు అయ్యాయి. అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా నేతృత్వంలో ఏర్పాటు చేసిన ఈ కూటమి నుంచి అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ అయ్యాక ఆ దేశం బయటకు వచ్చేసింది. హనోయ్‌లో జరిగిన రీజియనల్ కాంప్రిహెన్సివ్ ఎకనామిక్ పార్ట్‌నర్షిప్ (ఆర్‌సెప్) సమ్మిట్‌లో ఈ కూటమి ఏర్పాటు జరిగింది. ఈ కూటమి నుంచి 2017లో అమెరికా బయటకు వచ్చేసింది.
అమెరికా కూటమి నుంచి వైదొలగడంతో చైనా ఆధిపత్యం ఎక్కువగా అవుతుందని చెప్పొచ్చు. ఆగ్నేసియా, జపాన్ మరియు కొరియా దేశాలతో భాగస్వామ్యంలో చైనా పాత్ర మరింత బలపడే అవకాశాలున్నాయి. ప్రపంచ దేశాల ఆర్థిక వ్యవస్థల్లో రెండో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఉన్న చైనా ఆర్థికంగా మరింత బలోపేతం కావడమే కాకుండా ప్రాంతీయంగా దృఢమైన వాణిజ్య నిబంధనలు తీసుకువచ్చే అవకాశం ఉంది.

ఆర్‌సెప్ వేదికగా చైనా ఇతర ఓవర్సీస్ మార్కెట్లు, టెక్నాలజీలపై ఆధారపడే అవసరం కూడా ఉండదని గ్రేటర్ చైనా ఐఎన్‌జీ చీఫ్ ఎకానమిస్ట్ ఐరిస్ పాంగ్ చెప్పారు. ఆర్‌సెప్‌లో సౌత్ ఈస్టీ ఏషియన్‌కు చెందిన 10 దేశాలు సభ్య దేశాలుగా ఉంటాయి. ఇందులో చైనా, జపాన్, దక్షిణ కొరియా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ దేశాలు కూడా ఉంటాయి. ఇక పలు రంగాల్లో సుంకాలను తగ్గించుకునేందుకు ఈ వేదిక ఎంతో ఉపయోగపడుతుందని నిపుణులు చెబుతున్నారు.
ఆసియా సమాఖ్య సమావేశం సందర్భంగా పలువుదు దేశాధినేతలు చైనా అమెరికా మధ్య జరుగుతున్న వాణిజ్య యుద్ధాన్ని ప్రస్తావిస్తూనే ఒప్పందంను కుదుర్చుకున్నారు.ఇక కరోనా మహమ్మారి తర్వాత ఈ చైనా అమెరికా వాణిజ్యం సంబంధాలు ఎలా ఉంటాయో ప్రశ్నార్థకంగా మారిన సమయంలో ఈ కూటమి ఏర్పడటం ప్రాధాన్యత సంతరించుకుంది.
-
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
ఏపీలో ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్..! ఇకపై ఈ మార్పు..! -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
విజయ్‌కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం












Click it and Unblock the Notifications