షూటింగ్ చేస్తుండగా రైలు ప్రమాదం: రియాల్టీ స్టార్, మోడల్ మృతి

కాలిఫోర్నియా: అమెరికాలోని దక్షిణ కాలిఫోర్నియాలో విషాద సంఘటన చోటు చేసుకుంది. ఓ యాడ్ షూటింగ్ సమయంలో ప్రముఖ నటుడు, ఫిట్‌నెస్ మోడల్, రియాలిటీ టీవీ స్టార్ గ్రెగ్ ప్లిట్ జూనియర్ మృతి చెందారు. గ్రెగ్ ఫిట్‌నెస్ మోడల్‌గా దాదాపు రెండు వందలకు పైగా మేగజైన్ల కవర్ పేజీల పైన కనిపించారు.

ఓ పత్రిక కోసం యాడ్ షూటింగ్ చేస్తుండగా ఆయన మృతి చెందారు. ఈ షూటింగ్ రైలు ట్రాక్ పైన జరుగుతోంది. బుర్బంక్ మెట్రోలింక్ స్టేషన్ సమీప ట్రాక్ వద్ద షూటింగ్ జరుగుతోంది. ఇద్దరు వ్యక్తులు షూట్ చేస్తున్నారు. వారు నిషేధిత ప్రాంతంలో వీడియో తీస్తున్నారని తెలుస్తోంది.

Reality TV star Greg Plitt dies in train accident

ఆ సమయంలో రైలు వస్తోంది. రైలు హారన్ మోగించినప్పటికీ అక్కడ మలుపు ఉండటంతో.. అది మరో ట్రాక్‌లో వస్తోందని వారు పొరబడ్డారు. దీంతో ప్లిట్‌ను ఢీకొంది. అతను మృతి చెందారు. అయితే, రైలు వస్తున్న సమయంలో ప్లిట్ అలాగే నిలబడ్డారనే వాదనలు వినిపించాయి.

అయితే, బర్బంక్ పోలీసులు అది వాస్తవం కాదని చెప్పినట్లుగా తెలుస్తోంది. ఆధారాల కోసం ప్లిట్‌కు చెందిన క్యామ్‌కోర్డర్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ప్లిట్ బాల్టీమోర్‌లో జన్మించారని, తన గ్రాడ్యుయేషన్ అనంతరం అతను అమెరికా ఆర్మీలో అయిదేళ్ల పాటు పని చేశాడని తెలుస్తోంది. అతని వయస్సు 37.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+