మరోసారి కరోనా కలకలం..మాస్క్ లేకపోతే మటాషే..!
ఐదేళ్ల క్రితం ప్రపంచాన్ని అతలాకుతలం చేసిన కోవిడ్-19 మహమ్మారి మళ్లీ తన పంజా విసురుతోందా? హాంకాంగ్, సింగపూర్ దేశాల్లో ఇటీవల వెలుగుచూస్తున్న కోవిడ్ కేసులు కలకలం రేపుతున్నాయి. ఈ మహమ్మారితో పాటు, అడినో వైరస్, రైనో వైరస్ కూడా విజృంభిస్తుండటంతో ఈ రెండు దేశాల్లో పరిస్థితి ఆందోళనకరంగా మారింది.
హాంకాంగ్‌లో 17 నెలలు, 13 నెలల వంటి పసి పిల్లలకు సైతం కోవిడ్ సోకుతుండటం భయాన్ని కలిగిస్తోంది. ఈ నెల 3న తొలి కేసు నమోదవగా, కేవలం వారం రోజుల్లోనే వేల సంఖ్యలో కేసులు నమోదు కావడం పరిస్థితి తీవ్రతను తెలియజేస్తోంది. సింగపూర్‌లోనూ ఇదే పరిస్థితి నెలకొంది. వారం వ్యవధిలోనే 14,200 కేసులు నమోదైనట్లు అధికారులు వెల్లడించారు. ఈ నేపథ్యంలో, రెండు దేశాలు తిరిగి మాస్క్‌లను తప్పనిసరి చేస్తూ ఆదేశాలు జారీ చేశాయి.

కోవిడ్, అడినో, రైనో వైరస్‌ల వ్యాప్తిపై ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) సైతం అప్రమత్తమైంది. వైరస్ వ్యాప్తికి గల కారణాలు, తాజా పరిస్థితులపై ఆరా తీస్తోంది. ఆరోగ్యశాఖ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం, అధిక జనసమూహం ఉండే ప్రాంతాల్లోనే ఈ కేసులు ఎక్కువగా నమోదవుతున్నాయి. హాంకాంగ్‌లో కోవిడ్ పాజిటివ్ కేసుల సంఖ్య ఆందోళనకరంగా పెరుగుతోందని సెంటర్ ఫర్ హెల్త్ ప్రొటెక్షన్ కమ్యూనికేషన్ డిసీజ్ బ్రాంచ్ అధిపతి ఆల్బర్ట్ ఆయు స్థానిక మీడియాతో తెలిపారు. ప్రముఖ హాంకాంగ్ సింగర్ ఈసన్ చాన్ కూడా కోవిడ్ బారిన పడటంతో, తైవాన్‌లోని కావోసియుంగ్‌లో జరగాల్సిన ఆయన కార్యక్రమాలు రద్దయ్యాయి. ఈ పరిణామాలు ప్రపంచవ్యాప్తంగా మళ్లీ ఆందోళన కలిగిస్తున్నాయి.












Click it and Unblock the Notifications