ఇమ్రాన్ ఖాన్‌పై మాజీ భార్య రెహామ్ ఖాన్ నిప్పులు, ఆటోబయోగ్రఫీపై పీటీఐ ఆగ్రహం
ఇస్లామాబాద్: పీటీఐ అధ్యక్షులు, మాజీ క్రికెటర్ ఇమ్రాన్ ఖాన్ పైన ఆయన మాజీ భార్య రెహామ్ ఖాన్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఇమ్రాన్‌కు అసలు నీతి, నిజాయితీ లేదని చెబుతున్నారు. జర్నలిస్ట్ రెహామ్ ఖాన్‌ను 2015లో ఇమ్రాన్ పెళ్లి చేసుకున్నాడు. పది నెలల కాపురం అనంతరం వారు విడిపోయారు.
ఈ నేపథ్యంలో రెహామ్ ఖాన్ పాకిస్తాన్‌లో ఎన్నికలకు ముందు తన ఆటోబయోగ్రఫీ పుస్తకాన్ని తీసుకు వస్తున్నారు. ఇందులో ఇమ్రాన్ ఖాన్ పైన విమర్శలు ఉంటాయని చెబుతున్నారు. దీంతో రెహామ్ ఖాన్ పుస్తకాన్ని అడ్డుకునేందుకు ఇమ్రాన్ మద్దతుదారులు విశ్వప్రయత్నం చేస్తున్నారు. మరోవైపు, తాను ఆ పుస్తకాన్ని బయటకు తెస్తానని రెహామ్ ఖాన్ చెబుతున్నారు.

ఈ ఆటోబయోగ్రఫీలో కేవలం ఇమ్రాన్ ఖాన్ పైనే కాకుండా తాను కలిసిన ప్రముఖులు, ఇమ్రాన్ ఖాన్‌తో పెళ్లి వంటివి ఉంటాయని చెప్పారు. ఈ నేపథ్యంలో ఆమెకు పలువురు నోటీసులు కూడా జారీ చేశారు. ఆమె మాజీ భర్త కూడా నోటీసులు జారీ చేశారు.
కాగా, 1995లో బ్రిటన్ బిలియనీర్ కుమార్తె జెమీమా గోల్డ్‌స్మిత్‌ను వివాహమాడిన ఇమ్రాన్ ఖాన్ తొమ్మిదేళ్ల తర్వాత ఆమెతో విడిపోయారు. 2015లో బీబీసీ జర్నలిస్ట్ రెహమ్ ఖాన్‌ను రెండో పెళ్లి చేసుకున్నా 9 నెలలకే విడిపోయారు. ఇక మూడోసారి మతగురువు బుష్రా మనేకాను ఇమ్రాన్ 2018 ఫిబ్రవరిలో పెళ్లాడారు. మూడు నెలలకు వీరు కూడా విడిపోయారు.
-
జీవన్ రెడ్డికి కేసీఆర్ బిగ్ టాస్క్, ఆపరేషన్ బిగిన్..!! -
భానుడి భగభగలు, పిడుగులతో భారీ వర్షాలు - ఈ ప్రాంతాలకు తాజా హెచ్చరికలు..!! -
Vaibhav Sooryavanshi: బుడ్డోడు మరో వరల్జ్ రికార్డు-కేవలం రెండో బ్యాటర్..! -
'డెకాయిట్'లో అసలైన ట్విస్ట్ ఇదే! -
PM-Rahat: యాక్సిడెంట్ బాధితులకు క్యాష్ లెస్ ట్రీట్మెంట్-ఆస్పత్రులకు ఆదేశాలు..! -
Tamil Nadu polls: చివరి 'బ్రహ్మాస్త్రం' ప్రయోగించిన విజయ్.. ఇక సైకిల్ టూ సీఎం సీటే..! -
Video: ఇదెక్కడి మాస్ రా మావా. బటన్ నొక్కితే బండి నంబర్ ప్లేట్ ఛేంజ్ -
SRH కొంపముంచిన క్లాసెన్ జిడ్డు బ్యాటింగ్ -
రేపే రాజ పంచక కాలం ప్రారంభం -
వైభవ్ సూర్యవంశీ RCB పై ఆడిన సునామీ ఇన్నింగ్ దెబ్బకు.. !! -
రోజూ గుప్పెడు గింజలు తినండి.. షుగరు, బీపీ పూర్తిగా కంట్రోల్...!! -
చరిత్ర సృష్టించిన భారత ఆయిల్ ట్యాంకర్ 'జగ్ విక్రమ్'.. 20 వేల టన్నుల LPGతో హార్మూజ్ ను దాటి..











Click it and Unblock the Notifications