గూగుల్ సర్చ్ లో న్యూడ్ ఫోటోలకు సెన్సార్ బ్రేక్
శాన్ ఫ్రాన్సిస్కో: కంప్యూటర్ పరిజ్ఞానం ఉన్న వారు ఎవరైనా సరే ఎదైనా సమాచారం తెలుసుకోవాలంటే గూగుల్ సర్చ్ ను ఆశ్రయించడం సర్వ సాదరణం అయ్యింది. గూగుల్ సర్చ్ కు వెళ్లి వారికి కావలసిన సమాచారం తెలుసుకుంటున్నారు.
అదే విధంగా గూగుల్ లో అశ్లీల దృశ్యాలు వీక్షించే వారి సంఖ్య తక్కువ ఏమి కాదు. అయితే అలాంటి అశ్లీల చిత్రాలు చూడాలనుకునే వారు ఇక ముందు గూగుల్ నుండి తప్పని సరిగా అనుమతి తీసుకోవాలి. అందుకు రంగం సిద్దం చేస్తున్నారు.

ఇప్పటికే గూగుల్ యాజమాన్యం దీనిపై కసరత్తు మొదలు పెట్టింది. ఇక మీద అశ్లీల చిత్రాలు చూడాలన్నా, అలాంటి చిత్రాలు ఫోస్ట్ చెయ్యాలన్నా గూగుల్ అనుమతి తప్పని సరిగా తీసుకోవాలి. అనుమతి తీసుకోవడానికి గూగుల్ లోనే సెన్సార్ షిప్ ఫామ్ అందుబాటులోకి తీసుకు వస్తున్నారు.
ఆ ఫామ్ త్వరలోనే గూగుల్ సర్చ్ ఇంజన్ లో దర్శనం ఇవ్వనుంది. ఈ విధానం అమలులోకి వస్తే ఇంత కాలం ఇష్టం వచ్చినట్లు అశ్లీల చిత్రాలు చూస్తున్న వారికి చెక్ పెట్టినట్లు అవుతుంది. గతంలో అక్రమంగా అశ్లీల ఫోటోలు ఫోస్టు చేసి ఉంటే అవి మొత్తం తెరమరుగు కానున్నాయి.












Click it and Unblock the Notifications