న్యూయార్క్ విమానాశ్రయంలో కాల్పుల కలకలం: మూసివేత

న్యూయార్క్: అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం రేగింది. న్యూయార్క్‌లోని జాన్ఎఫ్ కెన్నడీ అంతర్జాతీయ విమానాశ్రయంలోని ఓ టెర్మినల్‌లో కాల్పుల శబ్దం వినిపించడంతో అప్రమత్తమైన అధికారులు వెంటనే విమానాశ్రయాన్ని మూసివేశారు.

టెర్మినల్ 8 వద్ద కాల్పుల శబ్దం వినిపించిన వెంటనే భద్రతా సిబ్బంది గేట్లు మూసేసి ప్రయాణికులు, ఉద్యోగులను ఎవరినీ బయటకు వెళ్లకుండా అడ్డుకున్నట్టు ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు.

 Reports of shots fired at JFK Airport unfounded, police say after evacuation

అయితే ఈ విషయంలో ఇప్పటి వరకు ఎటువంటి అరెస్టులు జరగలేదని తెలుస్తోంది. కాగా, కాల్పుల విషయం సోషల్ మీడియాకెక్కడంతో వార్త వెలుగులోకి వచ్చింది. టెర్మినల్ 8లో చాలామంది ప్రయాణికులు చిక్కుకుపోయినట్టు సోషల్ మీడియాలో పోస్టు అయిన ఫొటోలను బట్టి తెలుస్తోంది.

అయితే ఎయిర్‌పోర్టులో ఎటువంటి కాల్పులు జరగలేదని ప్రాథమిక విచారణలో వెల్లడైనట్టు విమానాశ్రయ అధికారులు తెలిపారు. ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదని చెప్పారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+