రష్యాపై ట్రంప్ నిర్ణయానికి చెక్: కదులుతున్న పావులు: త్వరలో.. !!

రష్యా నుంచి భారీ స్థాయిలో డీజిల్ దిగుమతి చేసుకోవాలన్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీసుకున్న నిర్ణయం.. రాజకీయ దుమారానికి దారితీసింది. ట్రంప్ పెట్టిన ఈ ప్రతిపాదనను అడ్డుకునే దిశగా పావులు సైతం కదులుతున్నాయి. యూఎస్ హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్ లో డెమోక్రాట్లు, రెబెల్ రిపబ్లికన్లు ఉమ్మడిగా ఓ ప్రత్యేక బైపార్టిషన్ బిల్లును ప్రవేశపెట్టనున్నారు. రష్యాతో చమురు ఒప్పందాలు చేసుకోవడం అమెరికా జాతీయ భద్రతకు, విదేశాంగ విధానానికి తీవ్ర విఘాతమనే ఆందోళన వ్యక్తమౌతోంది.

ఈ కొత్త చట్టాన్ని అధికార రిపబ్లికన్ పార్టీకి చెందిన బ్రియాన్ ఫిట్జ్‌పాట్రిక్ యూఎస్ కాంగ్రెస్ లో ప్రతిపాదించనున్నారు. ఆ పార్టీకే చెందిన నెబ్రాస్కా మెంబర్ డొన్ బాకెన్ సహా పలువురు డెమోక్రాట్ సభ్యులు.. దీనికి మద్దతు ఇవ్వాలని నిర్ణయించారు. రోనాల్డ్ రీగన్ పీస్ త్రూ స్ట్రెంగ్త్ యాక్ట్ పేరిట ఈ బిల్లు రూపుదిద్దుకుంటోంది. రష్యా నుండి ఎటువంటి ఇంధన ఉత్పత్తులను కొనుగోలు చేయకుండా పూర్తిస్థాయి నిషేధం విధించాలని ఇందులో ప్రతిపాదించారు.

Republican Congressman Announces Bipartisan Bill to Block Trump s Russia Diesel Sanctions Lift

విదేశాంగ వ్యవహారాలు, వాణిజ్యపరమైన నిర్ణయాల్లో దేశాధ్యక్షుడు స్వతంత్రంగా వ్యవహరించకుండా యూఎస్ కాంగ్రెస్ పర్యవేక్షణలోనే ఆయా కార్యకలాపాలు గానీ, నిర్ణయాధికారాలు గానీ ఉండేలా చూడటమే ఈ బిల్లు ముఖ్య ఉద్దేశం. అమెరికాలో పెరుగుతున్న ధరలను అదుపు చేయడం, అంతర్జాతీయ సరఫరాను మెరుగుపరచడానికి రష్యా నుండి తక్షణమే మూడు లక్షల టన్నుల డీజిల్‌ను కొనుగోలు చేయడానికి ఒప్పందం కుదిరిందని ట్రంప్ ఇటీవల ప్రకటించిన విషయం తెలిసిందే.

సౌదీపై విరుచుకుపడుతున్న హౌతీలు: రియాద్ ఎయిర్‌పోర్ట్ పై భీకర దాడి: 12 మందికి పైగా మృతి
సౌదీపై విరుచుకుపడుతున్న హౌతీలు: రియాద్ ఎయిర్‌పోర్ట్ పై భీకర దాడి: 12 మందికి పైగా మృతి

రష్యా, ఇరాన్‌పై కఠిన ఆంక్షలు విధించడానికి రష్యా భాగస్వామ్య దేశాలపై టారిఫ్ ను పెంచడానికి కొద్దిరోజుల కిందటే యూఎస్ కాంగ్రెస్ ఓ బిల్లును ఆమోదించింది. అది చట్ట రూపం దాల్చింది కూడా. డొనాల్డ్ ట్రంప్ తీసుకున్న ఈ తాజా నిర్ణయం.. ఈ చట్టాన్ని ఉల్లంఘించిందనేది రెబెల్ రిపబ్లికన్, డెమోక్రాట్ సభ్యల వాదన. రష్యా ఇంధన దిగుమతులపై గతంలోనే అమెరికా కాంగ్రెస్ స్పష్టమైన నిషేధాన్ని విధించిందని సెనేట్ విదేశాంగ కమిటీ సీనియర్ సభ్యురాలు జీన్ షాహీన్ గుర్తు చేశారు.

ఈ సాయంత్రమే తిరుమలలో ప్రధాన ఘట్టం: రేపటి నుంచి నవాహ్నిక ఉత్సవాలు
ఈ సాయంత్రమే తిరుమలలో ప్రధాన ఘట్టం: రేపటి నుంచి నవాహ్నిక ఉత్సవాలు

ఇటువంటి నిర్ణయాలు తీసుకోవాల్సి వచ్చినప్పుడు అధ్యక్షుడు చట్టప్రకారం యూఎస్ కాంగ్రెస్‌తో సంప్రదింపులు జరపాల్సి ఉంటుందని ఆమె తెలిపారు. రష్యా నుంచి డీజిల్ కొనుగోళ్ల వ్యవహారంలో దీన్ని పక్కనపెట్టడం సరైంది కాదని తేల్చి చెప్పారు. రష్యా నుండి అమెరికా భారీగా డీజిల్ కొనుగోలు చేయడం వల్ల ఆ దేశ మిలిటరీకి అవసరమైన ఆర్థిక వనరులు సమకూరుతాయని, ఇది ఉక్రెయిన్‌పై యుద్ధానికి పరోక్షంగా సహాయం చేసినట్లవుతుందని అన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+