టెక్కీలకు షాక్: చివరి దశలో హెచ్ -4 వీసాల రద్దు , 70 వేల మంది ఇండియన్లు ఇంటికేనా?
వాషింగ్టన్: హెచ్ 4 వీసాలను రద్దు చేసే ప్రక్రియ చివరి దశలో ఉందని అమెరికా ప్రభుత్వం సంకేతాలను ఇచ్చింది. అమెరికాలో హెచ్ 1 బీ వీసాతో పనిచేస్తున్న భాగస్వామ్యులకు హెచ్ 4 వీసాలను జారీ చేస్తారు. అయితే హెచ్ 4 వీసాలను రద్దు చేయాలని అమెరికా సర్కార్ భావిస్తోంది. ఈ నిర్ణయం తుది దశలో ఉందని అమెరికా ప్రభుత్వవర్గాలు చెబుతున్నాయి.
అమెరికాలో ట్రంప్ సర్కార్ బాధ్యతలు స్వీకరించిన తర్వాత స్థానికులకే ఉద్యోగావకాశాలను కల్పించాలనే ఉద్దేశ్యంతో హెచ్ 1 బీ వీసాల జారీ నిబంధనలను మరింత కఠినతరం చేసింది.
హెచ్ 1 బీ వీసాదారుల జీవిత భాగస్వామ్యులకు కల్పించే హెచ్ 4 వీసాల విషయంలో కూడ కఠినంగా వ్యవహరించాలని నిర్ణయం తీసుకొంది. ఇందులో భాగంగానే ఈ వీసాలను రద్దు చేయాలని అమెరికా భావిస్తోంది.ఈ ప్రక్రియ చివరి దశలో ఉంది.

చివరి దశలో హెచ్ 4 వీసాల రద్దు
అమెరికాలో పనిచేస్తున్న హెచ్ 1 బీ వీసాదారుల జీవిత భాగస్వామ్యులకు హెచ్ 4 వీసాలను జారీ చేస్తారు. అయితే హెచ్ 4 వీసాల విషయంలో అమెరికా సర్కార్ సీరియస్ గా ంది. ఈ వీసాలను రద్దు చేయాలనే యోచనలో ఉంది. ఈ వీసాలను రద్దు చేసే నిర్ణయం చివరి దశలో ఉందని ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ అమెరికా కోర్టుకు తెలిపింది.

ఇండియన్ టెక్కీలపై ప్రభావం
హెచ్ 4 వీసాలను రద్దు చేస్తే అమెరికాలో పనిచేస్తున్న వేలాది మంది ఇండియన్ టెక్కీలపై ఆ ప్రభావం కన్పించనుంది. ఈ వీసాలను రద్దు చేసేందుకు అమెరికా సర్కార్ ఆసక్తిని చూపుతోంది. ఇదే విషయాన్ని అమెరికా సర్కార్ ఫెడరల్ కోర్టుకు గురువారం నాడు ప్రకటించింది. హెమ్‌లాండ్ సెక్యూరిటీ ఫెడరల్ కోర్టుకు ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ గురువారం నాడు హెచ్ 4 వీసాలను రద్దు ప్రక్రియ చివరి దశలో ఉన్నట్టు ప్రకటించింది. ఈ వీసాలను రద్దు చేస్తే అమెరికాలో పనిచేస్తున్న వేలాది ఇండియన్ టెక్కీలు ఇండియా బాట పట్టాల్సిన పరిస్థితులు అనివార్యం కానున్నాయి.

ఒబామా సర్కార్ అనుమతి
అమెరికా అధ్యక్షుడిగా బరాక్ ఒబామా ఉన్న కాలంలో హెచ్ 1 బీ వీసాలపై పనిచేస్తున్నవృత్తి నిపుణుల జీవిత భాగస్వామ్యులు హెచ్ 4 వీసాలతో అమెరికాలో నివసించేందుకు అనుమతి ఇచ్చారు. అయితే ఈ నిర్ణయానికి చరమగీతం పాడాలనే ఉద్దేశ్యంతో ట్రంప్ సర్కార్ ఉంది. స్థానికులకు ఉద్యోగావకాశాలు కల్పించాలనే ఉద్దేశ్యంతోనే ట్రంప్ నేతృత్వంలోని సర్కార్ ఈ మేరకు నిర్ణక్ష్ం తీసుకొంది. హెచ్ 4 వీసాదారులు ఉద్యోగం చేయడానికి ఇచ్చే అనుమతులను రద్దు చేయాలని ట్రంప్ సర్కార్ చర్యలు తీసుకొంది.ఈ ప్రక్రియ చివరి దశలో ఉంది.

70 వేల మంది ఇండియన్ టెక్కీలకు షాక్
హెచ్ 4 వీసాలను రద్దు చేసే ప్రక్రియ చివరి దశలో ఉంది.ఈ వీసాలను రద్దు చేస్తే అమెరికాలో ఉంటూ హెచ్ 4 వీసాలపై ఆధారపడి ఉద్యోగాలు చేస్తున్న సుమారు 70 వేల మంది ఇండియన్ టెక్కీలు ఇక ఇంటి బాట పట్టాల్సిందే. వీరంతా అనివార్యంగా అమెరికాను వీడాల్సి వచ్చే అవకాశం లేకపోలేదు.
-
మెగాస్టార్‌కి బహిరంగంగా క్షమాపణలు చెప్పిన సీఎం.. -
విశాఖ టు బెంగళూరు వయా తిరుపతి వందేభారత్ స్లీపర్ రెడీ - రూట్ , ముహూర్తం..!! -
ఏపీలో భారీగా మద్యం ధరల తగ్గింపు, ఏ బ్రాండ్ ఎంత..!! -
ఢిల్లీలో జగన్ రూటు మారిందా, పార్లమెంట్ సాక్షిగా - కీలక మలుపు..!! -
T20 World Cup: సూర్యకుమార్ యాదవ్ కు ఐసీసీ అనూహ్య షాక్..! -
India Post GDS 2nd Merit List 2026: పోస్టల్ జాబ్స్ రెండో మెరిట్ లిస్ట్ అప్పుడే? -
టీం ఇండియాకు బీసీసీఐ భారీ నజరానా, ఒక్కొక్కరికి ఎంతంటే..!! -
పెట్రోల్ పై కేంద్రం ఎస్మా ప్రయోగం:LPG ఉత్పత్తి పెంచాలని హుకుం -
భారీగా పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు! -
మిథున రాశి 2026 2027 జాతకం.. ఈ ఏడాది వీరి మాటే శాసనం! -
టీమిండియాపై విధ్వంసకర సెంచరీ: కెప్టెన్‌గా ప్రమోషన్ -
వరల్డ్ కప్ గెలిచినా తప్పని చిక్కులు! ఆ ఆటగాడిపై ఐసీసీ వేటు?












Click it and Unblock the Notifications