అమెరికా యానం: వీసా ఉంటే నిషేధం నుంచి మినహాయింపు?

ట్రంప్ కొత్త ఇమ్మిగ్రేషన్ ఆర్డర్ లో ఇప్పటికే వీసాలు పొంది ఉన్న వారికి ‘ప్రయాణ నిషేధం’ నుంచి మినహాయింపు ఇచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

వాషింగ్టన్: వలసదారుల అమెరికా ప్రవేశంపై నిబంధనలు సడలించి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కొత్త ఇమ్మిగ్రేషన్ ఆర్డర్ ను తీసుకురానున్నారు. కొత్త ఉత్తర్వుల్లో ఇప్పటికే వీసాలు పొంది ఉన్న వారికి 'ప్రయాణ నిషేధం' నుంచి మినహాయింపు ఇచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

మార్పులతో వస్తున్న కొత్త ఇమ్మిగ్రేషన్ ఆర్డర్ పై ట్రంప్ ఈరోజు సంతకం చేసే అవకాశం ఉంది. ఏడు ముస్లిం మెజారిటీ దేశాల నుంచి వలసలను, శరణార్థులను అడ్డుకునేందుకు గతంలో ట్రంప్ తాత్కాలిక నిషేధం విధించగా, ఫెడరల్ కోర్టు ఈ ఉత్తర్వులను అడ్డుకున్న సంగతి తెలిసిందే.

మార్పులు చేసిన నిబంధనలతో న్యాయపరమైన సమస్యలు రాకపోవచ్చని అక్కడి న్యాయ విభాగం లాయర్లు అభిప్రాయపడుతున్నారు. అలాగే కొత్త నిబంధనల్లో మత సంబంధ మైనారిటీల శరణార్థి నిషేధంపై ఉన్న మినహాయింపులను తొలగించనున్నట్లు తెలిపారు.

 Revised Ban To Exempt Visa Holders, Sources Say

ఈ మినహాయింపు వల్ల కేవలం క్రైస్తవ శరణార్థులను మాత్రమే అమెరికాలోకి అనుమతిస్తున్నారని విమర్శలు వచ్చినందున దీన్ని తొలగిస్తున్నట్లు తెలుస్తోంది. కొత్త ఉత్తర్వుల్లో ప్రయాణ నిషేధం ఉన్న దేశాల జాబితా నుంచి ఇరాక్ ను మినహాయిస్తున్నట్లు కూడా సమాచారం.

ఈ విషయాలపై అధికారిక సమాచారం ఇంకా వెలువడలేదు. దీనిపై స్పందించడానికి వైట్ హౌస్, న్యాయ విభాగం, ఇతర అధికారులు నిరాకరించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+