గ్రీన్ కార్డుదారులకు వలస నిషేధం నుండి విముక్తి? ఆ దేశాలకు మళ్ళీ షాకేనా?
అమెరికా అధ్యక్షుడుగా ట్రంప్ బాధ్యతలను స్వీకరించిన తర్వాత తీసుకొన్న నిర్ణయాలు వివాదాస్పదమయ్యాయి. ఏడు ముస్లిం దేశాలను లక్ష్యంగా చేసుకొని విధించిన వలస నిషేధపు ఉత్తర్వుల్లో గ్రీన్ కార్డు దారులకు మినహయింపు
వాషింగ్టన్:అమెరికా అధ్యక్షుడుగా డొనాల్డ్ ట్రంప్ బాధ్యతలు స్వీకరించిన తర్వాత వలస నిషేధ ఉత్తర్వులపై సంతకం చేశారు. ఏడు ముస్లిం దేశాలను లక్ష్యంగా చేసుకొని ట్రంప్ ఈ నిషేధం ఉత్తర్వులను జారీ చేశారు.
అమెరికా అధ్యక్షుడుగా ట్రంప్ బాధ్యతలను స్వీకరించిన తర్వాత తీసుకొన్న నిర్ణయాలు వివాదాస్పదమయ్యాయి. ఈ నిర్ణయాల పట్ల ప్రపంచ వ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తాయి.అమెరికాలో కూడ ఇదే పద్దతి నెలకొంది.
అయితే ఏడు ముస్లిం దేశాలపై వలస నిషేధ ఉత్తర్వును సమీక్షించాలని అమెరికా ప్రభుత్వం నిర్ణయం తీసుకొంది. అయితే సమీక్షలో కూడ గ్రీన్ కార్డు ఉన్నవారికి వలస నిషఏధాల నుండి మనహయింపు ఇచ్చే అవకాశం ఉంది.

గ్రీన్ కార్డులున్నవారికి మినహాయింపు
ఏడు ముస్లిం దేశాలను లక్ష్యంగా చేసుకొని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీసుకొచ్చిన వలస నిషేధ ఉత్తర్వులపై నిరసనలు వ్యక్తమయ్యాయి.అయితే ఈ ఉత్తర్వులనుసమీక్షించనున్నట్టు ట్రంప్ ప్రభుత్వం ప్రకటించింది.అయితే ఈ ఏడు ముస్లిం దేశాలకు మినహయింపు ఉంటుందా అనేది ప్రస్తుతం ఉత్కంఠగా మారింది. అయితే ఈ ఏడు ముస్లిందేశాలకు చెందిన వారు అమెరికాలో గ్రీన్ కార్డు దారులైతే నిషేధం నుండి మినహాయింపును పొందే అవకాశం ఉందని అమెరికా అధికారులు చెబుతున్నారు.

వలస నిషేధ ఉత్తర్వులకు తుది రూపు
వలస నిషేధ ఉత్తర్వులపై నిరసనలు వెల్లువెత్తడంతో మార్పులు చేర్పులకు ట్రంప్ సర్కార్ శ్రీకారం చుట్టింది.ప్రస్తుతం ముసాయిదా అధికారులకు పంపారు. అయితే దీనిలో ఇంకా మార్పులు చేర్పులను పరిగణనలోకి తీసుకొని తుది ముసాయిదాను రూపొందించనున్నారు. త్వరలోనే తుది ముసాయిదాను విడుదల చేసే అవకాశం ఉందని వైట్ హౌజ్ అధికార ప్రతినిధి సారా హకబీ శాండర్స్ చెప్పారు.అయితే ఈ విషయమై హోమ్ లాండ్ సెక్యూరిటీ డిపార్ట్ మెంట్ స్పందించలేదు.

ముస్లింలకు మద్దతుగా ర్యాలీ
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీసుకొన్న వలస నిషేధ ఉత్తర్వులకు వ్యతిరేకంగా అమెరికాలో పెద్ద ఎత్తున నిరసనలు వ్యక్తమౌతున్నాయి.ముస్లింలకు మద్దతుగా ర్యాలీ నిర్వహించారు.విభిన్న మతాలకు చెందిన వారంతా నేను ముస్లింనే అంటూ ర్యాలీలో పాల్గొని మద్దతు ప్రకటించారు. ట్రంప్ ను వ్యతిరేకించండి అంటూ నినాదాలు చేశారు.ముస్లింలపై నిషేధం వద్దు అన్న బ్యానర్లను ప్రదర్శించారు.

ఏడు దేశాలకు వలసలపై మినహాయింపు ఉండదా?
వలస నిషేధ ఉత్తర్వులపై సమీక్షిస్తోన్న ట్రంప్ ప్రభుత్వం ఏడు ముస్లిం దేశాలకు మినహయింపు ఇస్తోందో లేదా అనే ఉత్కంఠ కొనసాగుతోంది. అయితే గ్రీన్ కార్డు ఉన్నవారికే మినహయింపును ఇచ్చే అవకాశం మాత్రం ఉంది.మరో వైపు ఏడు ముస్లిం దేశాలకు మాత్రం ఇబ్బందులు తప్పకపోవచ్చనే అభిప్రాయాలు లేకపోలేదు. పున:సమీక్షలో కూడ ఏడు ముస్లిం దేశాలను లక్ష్యంగా చేసుకొన్నారని ప్రచారం సాగుతోంది.
-
3000 ఏళ్ల సంప్రదాయం.. యుద్ధం మధ్యే నూతన సంవత్సరం -
AP Govt: రేపటి టెన్త్, ఇంటర్ పరీక్షలు వాయిదా..! కొత్త తేదీలివే..! -
బంగారం ధరలు చేయి దాటుతున్నాయ్- ఉగాది తర్వాత -
ఇరాన్ పై ముప్పేట దాడి- కలిసివచ్చిన ఆరు దేశాలు -
కొత్త పెన్షన్లు, మహిళలకు కొత్త వరాలు - రైతు భరోసా ఇక నుంచి..!! -
'దురంధర్ 2' ఓ చెత్త సినిమా: స్టార్ హీరోయిన్ -
బడ్జెట్ లో ఉద్యోగులు - మహిళలకు కొత్త వరాలు - పెన్షన్, 'కళ్యాణ లక్ష్మీ' పెంపు ఇలా..!! -
కేబినెట్ లోకి విజయశాంతి, పీసీసీ చీఫ్ మార్పు - ఆ ఇద్దరూ ఔట్..కొత్తగా..!! -
బెంగళూరులో రెండో భారీ ఎయిర్ పోర్ట్ కు కేంద్రం గ్రీన్ సిగ్నల్ -
ఏప్రిల్ నెలలో సింహరాశి, కన్యారాశి జాతక ఫలం -
భారీగా పెరిగిన డీజిల్ ధరలు, తగ్గుతున్న నిల్వలు- కొత్త రేట్లు ఇలా..!! -
ఏమి సేతు రా: 2 గంటలు వెయిట్ చేస్తే గానీ అమిత్ షా దొరకలేదు












Click it and Unblock the Notifications