Sirisha Bandla: స్పేస్‌లోకి మన గుంటూరు అమ్మాయి: అంతరిక్షం నుదుట తెలుగు తిలకం

వాషింగ్టన్: శిరీష బండ్ల.. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా మారుమోగిపోతోన్న పేరు. అంతరిక్షానికి తెలుగుదనాన్ని అద్దడానికి సిద్ధపడుతోన్న మన ఏపీ అమ్మాయి. ఈ నెల 11వ తేదీన అంతరిక్ష ప్రయాణానికి సమాయాత్తమౌతోన్నారు శిరీష బండ్ల (Sirisha Bandla). ఓ చరిత్రనే సృష్టించబోతోన్నారు. మొత్తం ఆరుమంది పరిశోధకులతో కూడిన టీమ్‌లో బండ్ల శిరీష ఒకరు. టీమ్ మొత్తానికీ ఆమె ఒక్కరే మహిళ కావడం కూడా ఓ రికార్డే. స్పేస్‌లో అడుగు పెట్టడానికి రంగం సిద్ధం చేసుకుంటోన్న అపర కుబేరుడు.. ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడు జెఫ్ బెజోస్ కంటే.. ముందే ఈ టీమ్ అంతరిక్షంలోకి ఎంట్రీ ఇవ్వబోతోంది.

వర్జిన్ స్పేస్ మిషన్

వర్జిన్ స్పేస్ మిషన్

వర్జిన్ స్పేస్ మిషన్‌తో పేరు చేపట్టిన ప్రాజెక్ట్ ఇది. జెఫ్ బెజోస్ కంటే కూడా ముందే అంతరిక్షంలో ప్రయాణించడానికి ఉద్దేశించిన మిషన్ ఇది. దీనికి రిచర్డ్ బ్రాస్నన్ సారథ్యాన్ని వహిస్తోన్నారు. ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన వర్జిన్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ అధినేత ఈ రిచర్డ్ బ్రాస్నన్. వర్జిన్ గెలాక్టిక్, వర్జిన్ ఆర్బిట్.. వంటి స్పేస్ రీసెర్చ్ సంస్థలు ఈ గ్రూప్‌లో ఉన్నాయి. దీని తరఫున ఆరుమంది సభ్యులతో కూడిన ఓ బృందాన్ని రిచర్డ్ బ్రాస్నన్ సిద్ధం చేసుకున్నారు. ఈ నెల 11వ తేదీన అంతరిక్షంలోకి దూసుకెళ్లబోతోన్నట్లు ఆయన తెలిపారు.

టీమ్‌లో ఎవరెవరు?

టీమ్‌లో ఎవరెవరు?

రిచర్డ్ బ్రాస్నన్ టీమ్‌లో ఆయనతో కలిపి మొత్తం ఆరుమంది ఉన్నారు. ఇద్దరు పైలెట్లు, ముగ్గురు స్పేస్ స్పెషలిస్టులు, ఒక బిలియనీర్.. ఇదీ ఈ క్రూ కూర్పు. శిరీష బండ్ల, డేవ్ మెక్‌కే, మైఖెల్ మసూక్కీ, సీజే స్టర్‌కోవ్, కెల్లి ల్యాటిమర్ ఉన్నారు. వీరిలో కెల్లి ల్యాటిమర్, మైఖెల్ మసూక్కీ పైలెట్లు. బ్రాస్నన్ బిలియనీర్ కాగా.. మిగిలిన ముగ్గురూ స్పెష్ స్పెషలిస్టులు. వర్జిన్ గెలాక్టిక్ స్పేస్‌క్రాఫ్ట్ (Virgin Galactic spacecraft) ద్వారా వారి ప్రయాణం సాగుతుంది. పసిఫిక్ టైమ్ జోన్ ప్రకారం.. ఈ నెల 11వ తేదీన తెల్లవారు జామున ఈ స్పేస్‌క్రాఫ్ట్ నింగిలోకి దూసుకెళ్తుంది. దీనితో అంతరిక్షంలో అడుగు పెట్టిన తొలి ప్రైవేటు ధనిక వ్యక్తిగా రిచర్డ్ బ్రాస్నన్ చరిత్ర సృష్టిస్తారు.

 ఎవరీ శిరిష బండ్ల..

ఎవరీ శిరిష బండ్ల..

శిరీష బండ్ల.. అచ్చ తెలుగమ్మాయి. పదహారాణాల గుంటూరు అమ్మాయి. స్వస్థలం తెనాలి. ఆమె పూర్వీకులు అమెరికాలో స్థిరపడ్డారు. వర్జిన్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్‌లో కీలకమైన వర్జిన్ గెలాక్టిక్ సంస్థలో ప్రభుత్వ వ్యవహారాలను పర్యవేక్షించే విభాగానికి ఉపాధ్యక్షురాలిగా పనిచేస్తోన్నారు. అమెరికాలోని డిస్ట్రిక్ట్ ఆఫ్ కొలంబియాలో ఆమె పని చేస్తోన్నారు. యూనివర్శిటీ ఆఫ్ ఫ్లోరిడా పూర్వ విద్యార్థిని. మైక్రోగ్రావిటీ సబ్జెక్ట్‌లో ఆమె నిష్ణాతురాలు. రిచర్డ్ బ్రాస్నన్ టీమ్‌లో సెలెక్ట్ కావడం పట్ల ఆమె ఆనందానికి హద్దుల్లేవు.

ఈ ప్రాజెక్టుతో సాధించేదేమిటీ?

ఈ ప్రాజెక్టుతో సాధించేదేమిటీ?

ప్రపంచంలోకెల్లా అత్యంత ధనవంతుడు జెఫ్ బెజోస్.. తన అంతరిక్ష ప్రయాణ తేదీని ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నెల 20వ తేదీన ఆయన స్పేస్‌లోకి వెళ్లనున్నారు. ఆయన కంటే.. తాను అక్కడ అడుగు పెట్టాలనే లక్ష్యంతో రిచర్డ్ బ్రాస్నన్ ఈ ప్రాజెక్ట్‌ను ప్రకటించారు. దీనికి సంబంధించిన కార్యక్రమాలన్నింటినీ యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేసుకున్నారు. అంతరిక్షంలోకి తాను వెళ్లాలనేది తల్లి చిరకాల వాంఛ అని.. దాన్ని తాను నెరవేర్చబోతోన్నందుకు ఉద్విగ్నంగా ఉందంటూ రిచర్డ్ బ్రాస్నన్ కొద్దిసేపటి కిందటే ఓ ట్వీట్ చేశారు. తన టీమ్‌ మెంబర్స్‌తో కూడిన ఓ వీడియో క్లిప్‌ను పోస్ట్ చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+