థ్రిల్లింగ్: ప్రాణాలకు తెగించి పెళ్లి ఫోటోలు (ఫోటోలు)

న్యూయార్క్: వధూవరులు పెళ్లి ఫోటోలు విన్నూత్నంగా తీసుకుంటున్నారు. జీవితాంతం ఆ తీపి గుర్తులు దాచి పెట్టుకోవాలని నవ దంపతులు భావిస్తున్నారు. ఇప్పుడు పెళ్లి రోజు ఫోటోల పిచ్చి పెద్ద ఫ్యాషన్ గా మారిపోయింది.

అనేక మంది కొండలెక్కి ఫోటోలు తీసుకుంటున్నారు. మంచు పర్వతాల్లో ఫోటోలు తీసుకుంటున్నారు. విన్నూత్న రీతిలో వివాహం చేసుకుంటున్నారు. అయితే అమెరికాలోని ఓ జంట ప్రాణాలకు తెగించి పెళ్లి దుస్తులతో ఫోటోలు తీసుకున్నారు.

క్రిస్టీనీ సుల్కోస్కీ, కెవిన్ లోల్ మేన్ అనే జంట పర్వత శిఖారాగ్రం మీద నుంచి కిందకు వేలాడుతూ ప్రాణాలకు తెగించి ఫోటోలు తీసుకున్నారు. పెళ్లి జరిగిన కొన్ని గంటలకే వారు ఈ సాహసానికి దిగారు.

Photos Courtesy: Facebook

పెళ్లి నాటి జ్ఞాపకాలు

పెళ్లి నాటి జ్ఞాపకాలు

పెళ్లి నాటి జ్ఞాపకాలు జీవితాంతం గుర్తు ఉండిపోవాలని చాల మంది సాహసం చేస్తున్నారు.

ప్రాణాలకు తెగిస్తున్నారు

ప్రాణాలకు తెగిస్తున్నారు

అమెరికాలో క్రిస్టీనీ సుల్కోస్కీ, కెవిన్ లోల్ మేన్ అనే జంట పర్వత శిఖారాగ్రం మీద నుంచి కిందకు వేలాడుతూ ప్రాణాలకు తెగించి ఫోటోలు తీసుకున్నారు.

అద్బుతమైన ఫోటోల కోసం

అద్బుతమైన ఫోటోల కోసం

సుందరమైన ప్రాంతాల్లోని పర్వతాల్లో నిలబడి ఫోటోలు తీసుకోవడానికి యువతులు పోటీ పడుతున్నారు

మోడల్స్ సైతం సై అంటున్నారు

మోడల్స్ సైతం సై అంటున్నారు

పలువురు మోడల్స్ సైతం ఇలాంటి సాహసాలు చేసి ఫోటోలకు ఫోజులు ఇస్తున్నారు.

కాలు జారితే అంతే

కాలు జారితే అంతే

కిందకు చూస్తే కళ్లు గిర్రున తిరుగుతాయి. అలాంటి చోట ఓ మోడల్ కాళ్ల వేళ్ల మీద నిలబడి ఇలా ఫోటోలకు ఫోజు ఇచ్చింది.

ఫోటో గ్రాఫర్ జాయ్

ఫోటో గ్రాఫర్ జాయ్

ఇలాంటి ఫోటోలు తీసుకునే వారిని ప్రముఖ ఫోటో గ్రాఫర్ జాయ్ ఫిల్ బ్రిక్ ప్రోత్సహిస్తున్నాడు.

వయస్సు లెక్క చెయ్యకుండా

వయస్సు లెక్క చెయ్యకుండా

ఫోటో గ్రాఫర్ జాయ్ ఫిల్ బ్రిక్ వయస్సు ఇప్పుడు 62 ఏళ్లు

నవదంపతులకు పోటిగా

నవదంపతులకు పోటిగా

నవదంపతులను ప్రోత్సహిస్తూనే ఆయన ప్రాణాలకు తెగించి పర్వతశ్రేణుల్లో సాహసం చేసి ఇలాంటి అద్బుతమైన ఫోటోలు తీస్తున్నారు.

350 అడుగుల ఎత్తులో

350 అడుగుల ఎత్తులో

నవదంపతులు ఏకంగా 350 అడుగుల ఎత్తులో నిలబడి ఫోటోలకు ఫోజులు ఇచ్చారు. వారికి ఫోటో గ్రాఫర్ జాయ్ ఫిల్ బ్రిక్ ధైర్యం చెప్పారు.

గతంలో పర్వతాలు ఎక్కాడు

గతంలో పర్వతాలు ఎక్కాడు

జాయ్ ఫిల్ గతంలో అనేక పర్వతాలు ఎక్కి సాహసాలు చేసి రికార్డు సృష్టించాడు. తరువాత ఫోటోగ్రాఫర్ అవతారం ఎత్తాడు.

అనేక మందికి శిక్షణ ఇచ్చాడు

అనేక మందికి శిక్షణ ఇచ్చాడు

గతంలో ఔత్సాహిక పర్వతారోహకులకు జాయ్ శిక్షణ ఇచ్చాడు.

ఇప్పుడు నవదంపతులకు

ఇప్పుడు నవదంపతులకు

ఇప్పుడు నవదంపతులకు కొద్దిపాటి శిక్షణ ఇచ్చి కొండెక్కించి ఇలాంటి ఫోటోలు తీస్తున్నారు.

ఫోటోలు తీసుకునే ముందు జాగ్రత్తలు

ఫోటోలు తీసుకునే ముందు జాగ్రత్తలు

నవదంపతులు, ఫోటో గ్రాఫర్ ఫోటోలు తీసుకునే ముందు తాళ్ల సహాయం తీసుకుంటున్నారు.

తాళ్లు కనపడకుండా జాగ్రత్తలు

తాళ్లు కనపడకుండా జాగ్రత్తలు

ఫోటోలు తీసే సమయంలో నవదంపతులకు కట్టి ఉన్న తాళ్లు కనపడకుండా జాగ్రత్తలు తీసుకున్నానని ఫోటో గ్రాఫర్ జాయ్ అంటున్నారు.

పలువురికి ఆదర్శం

పలువురికి ఆదర్శం

వయసు మీద పడినా ఫోటో గ్రాఫర్ జాయ్ పలువురు యంగ్ ఫోటో గ్రాఫర్లకు ఆదర్శంగా నిలుస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+