Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

రిషి సునాక్ గోల్డెన్ ఛాన్స్..? బ్రిటన్ ప్రధాని పదవీ వరించే అవకాశం, ఇదీ లెక్క

బ్రిటన్ ప్రధాని పదవీని కోల్పోయిన రిషి సునాక్‌కు బంపర్ ఆఫర్ లభించనుంది. ప్రధాని పదవీకి లిజ్ ట్రస్ ఎంపికైనా.. ఆమె నాయకత్వంపై సొంతపార్టీలో సందేహాలు వస్తున్నాయి. దీంతో మరో నేతను పార్టీ నేతలు చూస్తున్నట్టు తెలిసింది. ట్రస్‌ను ప్రధానిగా ఎన్నుకుని తప్పు చేశామా అని అధికార కన్సర్వేటివ్ పార్టీలో మొదలైనట్టు తెలుస్తోంది.

 rishi sunak may chance has britain pm

లిజ్ ట్రస్ నాయకత్వంపై పార్టీలో నమ్మకం సడలినట్టు తెలుస్తోంది. ప్రధాని పదవీ నుంచి లిజ్ ట్రస్‌ను తప్పించి.. ప్రభుత్వ బాధ్యతలను రిషి సునాక్‌తోపాటు మరో నేత పెన్నీ మోర్డాంట్‌కు అప్పగించేందుకు అధికార పార్టీ నేతలు ప్రయత్నాలు ప్రారంభించారట. ఇటీవల ట్రస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ ఘోరంగా విఫలమైంది. పన్నుకోతలతో తీవ్ర ఆర్థిక ఒడిదుడుకులు తప్పవని ఎన్నికల ప్రచార సమయంలో రిషి సునాక్ హెచ్చరించారు. ట్రస్ మాత్రం తన తాజా మినీ బడ్టెట్‌లో ఎన్నికల హామీలను యథాతథంగా అమలు చేసే ప్రయత్నం చేశారు.

మార్కెట్ ఒడిదుడుకులకు లోనై.. బ్రిటన్ కరెన్సీ విలువ ఒక్కసారిగా పడిపోయింది. కరెన్సీ విలువను మళ్లీ పెంచేందుకు ఏకంగా బ్రిటన్ సెంట్రల్ బ్యాంక్.. బ్యాంక్ ఆఫ్ ఇంగ్లండ్ రంగంలోకి దిగాల్సి వచ్చింది. దీంతో లిజ్ ట్రస్..తన ఆర్థిక మంత్రిని కూడా తప్పించారు. అధికార పార్టీ వర్గాల్లో ఆమెపై నమ్మకం సన్నగిల్లింది. వచ్చే సాధారణ ఎన్నికల్లో మరోసారి విజయం సాధించాలనే పట్టుదలతో కన్సర్వేటివ్ పార్టీ నేతలు ఉన్నారు. దీంతో కొందరు మళ్లీ రిషి పేరును తెరపైకి తెచ్చినట్టు తెలుస్తోంది.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+