భార్య గురించి రిషి కామెంట్స్.. అబ్బో అంటూ రచ్చ రచ్చ
బ్రిటన్ ప్రధాని రేసులో భారత సంతతి రాజకీయ నేత రిషి సునాక్ ఉన్నారు. అయితే ఆయన క్యాంపెయిన్ జరుగుతుంది. టీవీ డిబేట్ ఆశ్చర్యకర అంశాలను తెలియజేశారు. తనకు, తన భార్య అక్షత మూర్తికి గల తేడాలను వివరించారు. తాను ఎంతో ఒద్దికగా ఉంటానని, కానీ అక్షత మూర్తి గజిబిజి గందరగోళం మనిషి అని వివరించారు.

ప్రతిదీ పక్కాగా ప్రణాళికతో ఉండేలా చూసుకుంటానని, అక్షత మూర్తి అప్పటికప్పుడు అనుకుని చేసేస్తుంటుందని వెల్లడించారు. ఇంటిని చక్కగా ఉంచే విషయంలో ఆమె గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే అంతమంచిదని, ఈ విషయం చెబుతున్నందుకు తనను ఎంతగా తిట్టుకుంటుందో తనకు తెలుసని రిషి సునాక్ చమత్కరించారు.
ఇంటినిండా చిందరవందరగా బట్టలు, ఎక్కడిపడితే అక్కడ బూట్లు... అని చెప్పారు. ఇద్దరం ఇలా పరస్పరం భిన్నమైన వ్యక్తులం కావడం వల్లే తమ ప్రేమ పెళ్లి వరకు వెళ్లిందని భావిస్తున్నట్టు సునాక్ అభిప్రాయపడ్డారు. రిషి సునాక్ స్టాన్ ఫోర్డ్ యూనివర్సిటీలో ఎంబీఏ చేస్తుండగా ఇన్ఫోసిస్ నారాయణమూర్తి, సుధామూర్తి దంపతుల కుమార్తె అక్షత మూర్తి పరిచయం అయింది. ఈ జోడీ 2006లో బెంగళూరులో పెళ్లితో ఒక్కటైంది. వీరికి కృష్,, అనౌష్క అనే ఇద్దరు కుమార్తెలు ఉన్నారు.
-
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
లోకసభ, అసెంబ్లీ స్థానాల పెంపు - ఏపీ..తెలంగాణలో పెరిగేది ఇలా, మహిళల స్థానాలు ఇవే..!! -
PM Modi: ఇరాన్ వార్ తో మనకు కష్టాలే..! సిద్ధంగా ఉండాలన్న మోడీ..! -
కొత్త సినిమాలపై పవన్ కల్యాణ్ సంచలన నిర్ణయం, ఇక నుంచి..!! -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
టీడీపీ కంచుకోటలో వైసీపీ అభ్యర్ధి ఫిక్స్, 2024 నిర్ణయాల దిద్దుబాటు..!! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
వెండి విలయ తాండవం: నిలిచిపోయిన ట్రేడింగ్! -
"ధురంధర్" దెబ్బకి "పాకిస్థాన్" లో కలకలం.. నయా ఆపరేషన్ షురూ..!! -
మీనరాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది కార్యసిద్ధి, ఆర్థిక లాభం.. పూర్తి వివరాలివే! -
అమెరికాకు ఎదురుదెబ్బ? యుద్ధక్షేత్రం నుంచి వైదొలిగిన ఫోర్డ్.. కారణం ఏంటి?











Click it and Unblock the Notifications