Rishi Sunak: ట్రాన్స్‌జెండర్స్‌పై రిషి సునాక్ వివాదస్పద వ్యాఖ్యలు...
తాజాగా బ్రిటన్ ప్రధాని రిషి సునాక్ చేసిన వ్యాఖ్యాలపై సోషల్‌మీడియాలో దుమారం చెలరేగుతు్న్నాయి. Conservative Party కాన్ఫరెన్స్‌లో పాల్గొన్నరిషి సునాక్ ట్రాన్స్‌జెండర్‌ల గురించి మాట్లాడిన మాటలు వివాదాలకు దారితీసాయి. ఆయన చేసిన వ్యాఖ్యలపై సోషల్ మీడియాలో డిబేట్ జరుగుతోంది. రిషి సునాక్ ట్రాన్సజెండర్‌ల గురించి కొన్ని వివాదస్పద వ్యాఖ్యలు చేశారు. ఆయన జెండర్ గురించి తన అభిప్రాయాలు మీడియాతో వెల్లడించారు.
ఆ క్రమంలోనే "మగాడు మగాడే, మహిళ మహిళే" అని తేల్చి చెప్పారు. పురుషుడు మహిళగా, మహిళ పురుషుడిగా మారడం పిచ్చితనం లాంటిదని అన్నారు. పురుషుడు మహిళగా, మహిళ పురుషిడిగా మారిపోవడాన్ని అసలు అంగీకరించకూడదని ఆయన స్పష్టం చేశారు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు సోషల్‌మీడియాలో దుమారం రేపుతున్నాయి. కొందరు ఈ వ్యాఖ్యాలపై అసహనాన్ని వ్యక్తం చేస్తున్నారు.

ఇలాంటి వాటిని సమాజం అంగీకరించకూడదు :మహిళలు మహిళలే, పురుషులు పురుషులే. ఇది కామన్ సెన్స్. మహిళలు పురుషులుగా, పురుషులు మహిళలుగా ఎలా మారతారు. ఎవరు ఎలా అయినా మారిపోవచ్చనడాన్ని సమాజం ఏ మాత్రం అంగీకరించకూడదు. వాళ్లు అలా చేయలేరు. ఈ దేశ ప్రజల జీవితాల్ని మార్చేస్తాం. అదే మా లక్ష్యం. కానీ, మన అభివృద్ధి, స్వేచ్ఛ అనేవి వివాదాస్పదం అవకుండా ఉండడం అంత కన్నా ముఖ్యంమని అన్నారు. కష్టపడి పని చేసే ప్రతి ఒక్కరూ నేను చెప్పిన విషయాన్ని అంగీకరిస్తారు. స్కూల్‌లో తమ పిల్లలు రిలేషన్‌షిప్స్ గురించి ఏం నేర్చుకుంటున్నారు అని తల్లిదండ్రులు ఆందోళన పడకూడదనది అని అన్నారు.
సెన్స్ లేకుండా మాట్లాడారంటున్న నెటిజన్లు : అయితే, సునాక్ చేసిన వ్యాఖ్యలపై సోషల్‌మీడియాలో అలా ఎలా మాట్లాడతారంటూ కొందరు పోస్టులు పెడుతున్నారు.ప్రస్తుత సమాజంలో ట్రాన్స్‌జెండర్లు ఎన్నో సమస్యలను ఎదుర్కొంటున్నారని, ఇప్పుడు సునాక్ చేసిన వ్యాఖ్యలు మరింత సమస్యగా మారాయని ట్విట్టర్‌లో కొందరు మండిపడుతున్నారు. కామన్ సెన్స్ గురించి మాట్లాడిన సునాక్, ఆ సెన్స్ లేకుండానే మాట్లాడారంటూ ఇంకొందరు నెటిజన్లు ఆయనపై ఫైర్ అవుతున్నారు. బహుశా సునాక్‌కి సెక్స్, జెండర్‌కి ఉన్న తేడా ఏంటో తెలిసి ఉండదని, అందుకే ఆయన ఇలాంటి వ్యాఖ్యలు చేశారని మరికొందరు కామెంట్ చేస్తున్నారు. దీనిపై రిషి సునాక్ ఎలా స్పందిస్తారో వేచి చూడాల్సిందే.












Click it and Unblock the Notifications