అద్భుతం: 5 అంతస్థుల భవనంపై డబుల్ రోడ్డు (వీడియో)

ఐదంతస్తుల భవనంపై రెండు వరుసల రహదారిని నిర్మించారు చైనీయులు. ఈ రహాదారిపై సాధారణ రోడ్డుపై వాహనాలు ఎలా ప్రయాణిస్తాయో అదే తరహలో వాహనాలను నడుపుతున్నారు.

బీజింగ్: ఐదంతస్తుల భవనంపై రెండు వరుసల రహదారిని నిర్మించారు చైనీయులు. ఈ రహాదారిపై సాధారణ రోడ్డుపై వాహనాలు ఎలా ప్రయాణిస్తాయో అదే తరహలో వాహనాలను నడుపుతున్నారు.

రహదారికి ఇరువైపులా చెట్లు, మధ్యలో రయ్ మంటూ దూసుకెళ్ళే వాహనాలు ప్రస్తుతం నెటిజన్లను ఆకర్షిస్తోంది. చైనాలోని చాంగ్కింగ్ నగరంలో ట్రాఫిక్ బాధలను తీర్చేందుకు చైనీయులు ఐదంతస్థుల భవనంపై రోడ్డెశారు.

నగరంలో రోజురోజుకి ట్రాఫిక్ సమస్యలు పెరుగుతున్నాయి. దీన్ని అధిగమించేందుకు గాను వినూత్నంగా ఆలోచించారు. అయితే ఇందులో వింతేముంది? అనుకొంటున్నారా? ఆ రహాదారి ఉన్నది ఐదంతస్థుల భవంతి మీద.

నగరంలో రోజురోజుకు పెరిగిపోతున్న ట్రాఫిక్ సమస్యలను అధిగమించేందుకు వినూత్నంగా ఇలా ఐదంతస్థుల భవంతి మీద రహదారిని నిర్మించారు. రహదారిపై చెట్లు, దుకాణాలు కూడ ఉన్నాయి.

భవనం కింద అంతస్థును వాణిజ్య కార్యకలాపాల కోసం మిగతా అంతస్థులను వాహనాల పార్కింగ్ కోసం కేటాయించారు. ఈ రహదారిపై వాహన శబ్దాలను నియంత్రించేందుకు అధునాతన సాంకేతికతను కూడ వినియోగించారు.

8.5 మిలియన్ జనాభా కలిగి ఉన్న ఈ నగరంలో ట్రాఫిక్ సమస్యల పరిష్కారం కోసం తక్కువ స్థలంలో ఎక్కువ వినియోగం పేరిట ఇలాంటి వినూత్న ప్రాజెక్టులను చేపడుతున్నారు. నివాస భవంతుల గుండా వెళ్ళే రైల్వే లైన్ ను చొంగ్ కింగ్ లో నిర్మించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+